రెండు హెలిక్యాప్టర్ లు గాలి ప్రయాణిస్తున్న సమయంలో ఎదురెదురగా ఢీకొన్న ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. 

ఆస్ట్రేలియన్ బీచ్‌లో సోమవారం రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ హెలిక్యాప్టర్ లో ఉన్న ప్రయాణికులకు గాయాలు అయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. మరో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని పేర్కొన్నారు. అయితే మొత్తంగా ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారనే విషయాన్ని వెల్లడించలేదు. 

దెయ్యం వదిలిస్తానని మైనర్ బాలికపై అత్యాచారం.. యూపీలో ఘటన

క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లోని మెయిన్ బీచ్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘర్షణ వల్ల హెలికాప్టర్ శిథిలాలు బీచ్ లోని ఇసుకపై పడిపోయాయి. దీంతో అధికారులు క్రాష్ సైట్‌కు దారితీసే సీవరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు. సీవరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది.

Scroll to load tweet…

గోల్డ్ కోస్ట్ ప్రాంతం దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. జనవరి నెలలో ఇది అత్యంత రద్దీగా ఉంటుంది. కాగా ఈ సమయంలోనే ఆస్ట్రేలియాలో స్కూల్స్ కు, ఇతర సంస్థలకు సెలవులు ఇస్తారు. ప్రజలంతా తమ సెలవులను ఎంజాయ్ చేయడానికి బీచ్ ల వద్దకు చేరుకుంటారు. ఈ సమయంలోనే ఈ హెలిక్యాప్టర్ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఇంత వరకు ఎలాంటి మరణం సంభవించినట్టు సమాచారం అందలేదు.