పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై ఆ దేశ కోర్టు సంచలన కామెంట్స్ చేసింది. దేశ ద్రోహం కేసులో ముషారఫ్ కి ఇటీల పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా... ఆ ఉరిశిక్ష అమలు చేసేలోపే ఏదైనా కారణంతో ఆయన చనిపోతే... శవాన్ని ఉరితీయాలని పేర్కొనడం గమనార్హం. 

‘‘ ముషారఫ్ మృతదేహాన్ని పార్లమెంటు ఎదురుగా ఉన్న డి.స్వ్కేర్‌ దగ్గరకు ఈడ్చుకురండి. ప్రజలకు గుర్తుండి పోయేలా మూడు రోజుల పాటు కూడలిలోనే మృతదేహాన్ని వేలాదీయండి. అతనికి విధించిన మరణశిక్ష అమలయ్యే లోపే వేరే కారణాల వల్ల తను చనిపోయినా వదలొద్దు. మృతదేహాన్ని తీసుకొచ్చి మూడు రోజుల పాటు ఇదే కూడలిలో ఉరితీయండి’’ అంటూ కోర్టు పేర్కొంది.

దేశద్రోహం కేసులో ర్వేజ్ ముషారఫ్‌ను ఉరితీయాలంటూ సంచలన తీర్పుచెప్పింది స్థానిక కోర్టు. అయితే, ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీ తాజాగా బయటకు వచ్చింది. అందులో ఉన్న విషయాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ముషారఫ్ మీద ఆరోపణలను త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అందులో ఇద్దరు ముషారఫ్‌ను దోషిగా తేల్చారు. మరో జడ్జి దాంతో విబేధించారు. ఆ జడ్జిలు 167 పేజీల తీర్పు ప్రతిని అందించారు. 

అందులో కోర్టు పాయింట్ల వారీగా వివరాలను చెప్పింది. 65, 66 పాయింట్‌లో కోర్టు కీలక పాయింట్‌ను సూచించింది. ‘నిందితుడి మీద మోపిన ఆరోపణల ప్రకారం ముషారఫ్‌ దోషి. దోషిని చనిపోయే వరకు ఉరితీయాలి. పరారీలో ఉన్న దోషిని పట్టుకుని తీసుకురావాల్సిందిగా సంబంధిత శాఖలను కోర్టు ఆదేశిస్తుంది. ఒకవేళ దోషి శవం దొరికితే, దాన్ని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు ఆ శవాన్నే ఉరితీయాలి’ అని కోర్టు తీర్పులో పేర్కొంది.