"గాజాలో హమాస్ నియంత్రణ కోల్పోయింది".. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటన..

గాజాలోని పరిస్థితులపై ఆ ప్రాంత ఆరోగ్య సహాయ మంత్రి యూసెఫ్ అబు రిష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనం, విద్యుత్ కొరతల వల్ల అన్ని ఆసుపత్రులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు.

Hamas has lost control in Gaza : Israeli Defense Minister  - bsb

గాజా : హమాస్ "గాజాలో నియంత్రణ కోల్పోయింది" అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సోమవారం పేర్కొన్నారు. పాలస్తీనా గ్రూపు దేశంపై "సర్ఫ్రైజ్" దాడిని ప్రారంభించి, 500కి పైగా రాకెట్లను ప్రయోగించిన నెల రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.  దీంట్లో "గాజాపై హమాస్ నియంత్రణ కోల్పోయింది. ఉగ్రవాదులు దక్షిణం వైపు పారిపోతున్నారు. పౌరులు హమాస్ స్థావరాలను దోచుకుంటున్నారు" అని చెప్పుకొచ్చారు. అయితే దీనికి తగిన ఆధారాలను చూపించలేదు.  

ఇజ్రాయెల్ టీవీల్లో దీనికి సంబంధించి వీడియో ప్రసారం చేశారు. ఈ వీడియోలో "గాజా ప్రజలకు అక్కడి ప్రభుత్వంపై నమ్మకం లేదు" అని చెప్పుకొచ్చారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ సైనికులపైసరిహద్దుల్లో హమాస్ యోధులు దాడులతో గాజా యుద్ధం మొదలయ్యింది. ఇప్పటివరకు దాదాపు 1,200 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. దాదాపు 240 మందిని బందీలుగా తీసుకున్నారని ఇటీవలి ఇజ్రాయెల్ గణాంకాల ప్రకారం సమాచారం.

David Cameron :రిషి సునక్ కేబినెట్ లో యూకే మాజీ ప్రధానికి చోటు.. విదేశాంగ కార్యదర్శిగా డేవిడ్ కామెరూన్ నియామకం

గాజాలోని పరిస్థితులపై ఆ ప్రాంత ఆరోగ్య సహాయ మంత్రి యూసెఫ్ అబు రిష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనం, విద్యుత్ కొరతల వల్ల అన్ని ఆసుపత్రులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. ఈ కారణంతోనే గాజాలోని అతి పెద్దదైన అల్-షిఫా ఆసుపత్రిలో ఇటీవల ఏడుగురు నెలలు నిండని శిశువులు, 27 మంది రోగులు మరణించారని అబూ రిష్ తెలిపారు. గాజా మొత్తం ఇజ్రాయెల్ ముట్టడిలో ఉంది. ఆహారం, ఇంధనం.. ఇతర ప్రాథమిక సామాగ్రి కొరత ఉంది. 

పాలస్తీనా ప్రధాని మహ్మద్ ష్టయ్యే సోమవారం యూరోపియన్ యూనియన్,  ఐక్యరాజ్యసమితిని గాజాలో "పారాచూట్ సహాయం" చేయాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యూఎస్ మీడియాతో మాట్లాడుతూ, గాజాలో హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించేందుకు ఒప్పందం కుదుర్చుకోవచ్చని, అయితే సంభావ్య ప్రణాళికను దెబ్బతీస్తుందనే భయంతో వివరాలను అందించడానికి నిరాకరించారు.

అయితే, గాజాలోని ఒక పాలస్తీనా అధికారి మాట్లాడుతూ.. "ఖైదీల విడుదలపై ప్రాథమిక ఒప్పందానికి రావడంలో జాప్యం, అడ్డంకులకు కారణం నెతన్యాహు" అని ఆరోపించారు.ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా రహస్య స్థావరాలపై దాడులతో దాడి చేశాయి. సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ పౌరులను ఇన్‌కమింగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి గాయపరిచిందని సైన్యం తెలిపింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios