Asianet News TeluguAsianet News Telugu

మారథాన్‌పై విరుచుకుడిన వడగండ్ల వాన, ఈదురుగాలులు.. 21 మంది వాలంటీర్లు దుర్మరణం

చైనాలో మారథాన్‌పై అతిచల్లని వర్షాలు, వడగండ్లు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. గన్షూ ప్రావిన్స్ లోని బయాన్ కు సమీపంలో ఉన్న ఎల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్ లో జరుగుతున్న వంద కిలో

hail storm and exreme weather on marathon kills 21 in china ksp
Author
Beijing, First Published May 23, 2021, 2:24 PM IST

చైనాలో మారథాన్‌పై అతిచల్లని వర్షాలు, వడగండ్లు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. గన్షూ ప్రావిన్స్ లోని బయాన్ కు సమీపంలో ఉన్న ఎల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్ లో జరుగుతున్న వంద కిలోమీటర్ల క్రాస్ కంట్రీ మౌంటెయిన్ రేస్ సాగుతుండగా భారీ వర్షాలు విరుచుకుపడ్డాయని చైనా జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. మొదట 20 మంది చనిపోయారని, ఒకరు గల్లంతయ్యారని తెలిపింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టగా.. ఉదయం 9.30 గంటలకు మృతదేహం లభించిందని పేర్కొంది.

శనివారం మధ్యాహ్నం మారథాన్ సాగుతుండగా 20 నుంచి 31 కిలోమీటర్ల మధ్య వడగండ్ల వాన విరుచుకుపడిందని అధికారులు వెల్లడించారు. దానికి తోడు బలమైన గాలులు వీచాయని చెప్పారు. మారథాన్‌లో 172 మంది పాల్గొనగా.. 18 మందిని సహాయ బృందాలు కాపాడగా.. ప్రస్తుతం మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Also Read:క్లిష్ట సమయంలో భారత్... లడఖ్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ

అతి శీతల వాతావరణం కారణంగా చాలా మంది రన్నర్ల శరీర ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. కాగా, గన్షూ ప్రావిన్స్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా వుంటుందో అంచనా వేయడం కష్టం. గతంలో అక్కడ భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడిన సంఘటనలను స్థానికులు వెల్లడిస్తున్నారు. 2010లో వచ్చిన బురద వరద వల్ల ఇక్కడి ఓ పట్టణంలో దాదాపు వెయ్యి మంది చనిపోయారని చెబుతున్నారు. అంతేగాకుండా ఆ ప్రాంతం భూకంప జోన్‌లోనూ వుందని అధికారులు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios