Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్‌ టెక్కీలకు షాక్: ప్రతిభావంతులకే హెచ్-1 బీ వీసాలు

హెచ్-1 బీ వీసా నిబంధనలను ట్రంప్ సర్కార్ మరింత కఠినతరం చేస్తోంది. అత్యంత ప్రతిభావంతులకే  వీసాను ఇవ్వాలని  ట్రంప్ సర్కార్ నిర్ణయించింది

H-1B visa should attract best talent: US homeland secretary
Author
USA, First Published Dec 21, 2018, 8:24 PM IST


వాషింగ్టన్: హెచ్-1 బీ వీసా నిబంధనలను ట్రంప్ సర్కార్ మరింత కఠినతరం చేస్తోంది. అత్యంత ప్రతిభావంతులకే  వీసాను ఇవ్వాలని  ట్రంప్ సర్కార్ నిర్ణయించింది.

ఈ ఏడాది హెచ్-1 బీ వీసాలకు గాను వచ్చిన ధరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులకే ఈ వీసాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు సెక్యూరిటీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. అమెరికాలో ఉన్న స్థానిక యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.

ప్రతి ఏటా ప్రతి ఏడాది హెచ్-1 బీ వీసా ధరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  దీంతో వచ్చిన ధరఖాస్తుల్లో  అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకొంటే కంపెనీలకు మేలు జరుగుతోంది. పనిలో  నాణ్యత పెరుగుతోందన్నారు 

దీనికి తోడు అమెరికాలోని స్థానిక పౌరులకు కూడ ఉద్యోగావకాశాలు చేసుకొనే అవకాశం దక్కుతోందన్నారు. స్థానిక నియామకాలు మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు  హోమ్‌ల్యాండ్  ప్రతినిధులు ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios