వాయిదా పడుతూ వస్తున్న ప్రఖ్యాత హాలీవుడ్‌ 63వ గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్ మార్చి 14 ఆదివారం లాస్‌ఎంజిల్స్‌లో ఎట్టకేలకూ జరిగాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుకగా గ్రామీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. 

ఈ వేడుకల్లో అత్యధికంగా ట్రోఫీలను గెలుచుకున్న మహిళగా బెయోన్స్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం  బెయోన్స్ 28 ట్రోఫీలను గెలుచుకుంది. ఈ ట్రోఫీలతో  బెయోన్స్ ప్రముఖ సింగర్ అలిసన్ క్రాస్ ను దాటింది. 

కోవిడ్ కారణంగా జనవరి 31న జరగాల్సిన ఈ వేడుకలు మార్చి 14కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య నిపుణులు, అవార్డు నామినీలు, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చల తరువాత ఈ వేడుకను వాయిదా వేసి ఇప్పుడు నిర్వహించారు. 

ఈ యేడాది వివిధ కేటగిరీల్లో గ్రామీ అవార్డులను గెలుచుకున్న విజేతలు వీరే...

రికార్డ్ ఆఫ్ ది ఇయర్ : ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : ఫోక్ లోర్ బై టేలర్ స్విఫ్ట్
సాంగ్ ఆఫ్ ది ఇయర్ : ఐ కాంట్ బ్రీత్ బై హెచ్.ఈ.ఆర్
ఉత్తమ నూతన ఆర్టిస్ట్ : మేగాన్ దీ స్టాలియన్
ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన : వాటర్ మెలాన్ బై హ్యారీ స్టైల్స్
ఉత్తమ రాక్ సాంగ్ : స్టే హై బై బ్రిటనీ హోవార్డ్
ఉత్తమ రాక్ ఆల్బమ్ : ది న్యూ ఆబ్ నార్మల్ బై ది స్ట్రోక్స్
ఉత్తమ ర్యాప్ సాంగ్ : సావేజ్ బై మేగాన్ తీ స్టాలియన్
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ : కింగ్స్ డిసీజ్ బై నాస్