జూన్ 21న ప్రధాని మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో మూడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న సంగీత విద్వాంసుడు కేజ్ పాల్గొంటారు.

ప్రధాని నరేంద్ర మోదీ కృషి వల్ల యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత లభించిందని గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ప్రధానమంత్రి మోడీ కారణంగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ సంవత్సరం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ప్రధాని మోడీ అందరికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్రపంచ యోగా దినోత్సవానికి హాజరుకావడం నాకు చాలా ఆనందంగా ఉంది," అని రికీ కేజ్ అన్నారు. జూన్ 21న ప్రధాని మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో మూడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న సంగీత విద్వాంసుడు కేజ్ పాల్గొంటారు.

ప్రధాని మోదీ అమెరికాకు అధికారిక పర్యటనపై కూడా కేజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఇద్దరు ప్రపంచ నాయకులు స్నేహపూర్వక స్ఫూర్తితో కలిసి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందనీ, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మారుస్తుందనీ, పలు రంగాలలో భారతదేశం నాయకత్వం వహిస్తోంది. వాతావరణ మార్పు, పర్యావరణ అవగాహన, దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందాలు జరుగనున్నాయి. భారత్ ను ఇకపై గ్లోబల్ సౌత్‌కు లీడర్ గా పరిగణించబడుతుంది. ఈ సమావేశం వల్ల ప్రపంచం ప్రయోజనం పొందుతుందని పేర్కొన్నారు. 

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం ప్రధాని మోదీ వాషింగ్టన్‌ను సందర్శిస్తారు. అక్కడ (జూన్ 22న) వైట్‌హౌస్‌లో ఉత్సవ స్వాగతం పలుకుతారు. ఆ తరువాత ఉన్నత స్థాయి సంభాషణను కొనసాగించడానికి అధ్యక్షుడు బిడెన్‌ను కలుస్తారు. అలాగే.. ప్రెసిడెంట్ జో బిడెన్ , ప్రథమ మహిళ జిల్ బిడెన్ అదే రోజు సాయంత్రం ప్రధాని గౌరవార్థం స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 22న జరుగునున్న యుఎస్ కాంగ్రెస్ జాయింట్ సిట్టింగ్‌లో కూడా ప్రధాని ప్రసంగిస్తారు.

వైట్‌హౌస్‌లో జరిగే కార్యక్రమంలో గ్రామి అవార్డీ కేజ్‌ని కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చాలనే స్ఫూర్తితో ఇద్దరు ప్రపంచ నాయకులు ఒక్కటవ్వడం, స్నేహపూర్వకంగా కలిసి రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. గతంలో భారత్ ఎప్పుడూ పాల్గొనలేదని చెబుతుండేది. అంతర్జాతీయ సంభాషణలలో, అంతర్జాతీయ ఉద్యమాలు, ఒప్పందాలు అలాంటి వాటిలో ఎప్పుడూ పాల్గొనలేదు. అయితే ఇప్పుడు వాతావరణ మార్పు, పర్యావరణ అవగాహన, అంతర్జాతీయ ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య బంధాలు వంటి వాటిని పరిశీలిస్తే, భారతదేశం ఇకపై పక్కన కూర్చోవడం లేదు. భారతదేశం కేవలం పాల్గొనడం మాత్రమే కాదు, భారతదేశం నాయకత్వం వహిస్తోంది. రానున్న రోజుల్లో భారతదేశం గ్లోబల్ సౌత్‌కు అగ్రగామిగా పరిగణించబడుతుంది. కాబట్టి వాస్తవానికి ప్రధాని మోడీ వంటి నాయకుడు రావడం అమెరికాకు చాలా చాలా ప్రయోజనకరంగా ఉందని నేను భావిస్తున్నాను."అని అన్నారాయన.