వెర్రి వేయి విధాలని కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది దారినపోయే కంపను నెత్తికి చుట్టుకున్నట్టుగా విచిత్రంగా వ్యవహరిస్తారు. అది చివరికి భస్మాసుర హస్తంలా వారినే ఇబ్బంది పెడుతుంది. అలాంటి విచిత్ర సంఘటనే ఒకటి ఇటీవల విదేశాల్లో జరిగింది. 

అత్యంత శక్తివంతమైన గొరిల్లా గ్లూతో ప్రయోగాలు చేయబోయి మొదటికే మోసం తెచ్చుకుందో యువతి. టెస్సికా బ్రౌన్ అనే ఓ అమ్మాయి హెయిర్ స్టైల్ ప్రయోగం చేద్దామని గొరిల్లా గ్లూను తలకు రుద్దుకుంది. అంతే జుట్టు తలకు అతుక్కుపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గ్లూ పోలేదు. 

దీంతో బయపడి ఆస్పత్రికి వెడితే డాక్లర్లు ఆమె తలకు అంటుకున్న గ్లూను తీసేశారు. అయితే దీనికోసం ఆమె జుట్టు మొత్తం తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు చికిత్సకు 12వేల డాలర్లకు పైగా ఖర్చయ్యింది. 

తన దీనస్థితిని చెబుతూ టెస్సికా నెటిజన్స్ ను ఆర్థిక సాయం కోరింది. వైద్య ఖర్చులకు సాయపడాల్సిందిగా అర్థించింది. అయితే లెన్ మార్టిన్ అనే నెటిజన్ టెస్సికా అబద్ధం చెబుతుందని కామెంట్ చేశాడు. అంతేకాదు అది ఈజీగా తుడుచుకోవచ్చని చెప్పాడు. కావాలంటే ఆ గ్లూను తాను వాడి చూపిస్తానన్నాడు.

అది ప్రూవ్ చేయడానికి ఓ ప్లాస్టిక్ బాటిల్ కు గ్లూ అంటించి దాన్ని తన పెదాలకు పెట్టుకున్నాడు. అంతే అది అలా అతుక్కుపోయింది. ఇంక ఎంతకీ రాలేదు. దీంతో మార్టిన్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. విషయం ఏంటంటే ఆ గ్లూ తీయడానికి మార్టిన్ పెదాలు తీసేయాల్సి రావడం ఇక్కడ కొసమెరుపు.