Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. ఎయిర్ పోర్టు నుంచి బంగారం కంటైనర్ చోరీ.. సురక్షిత ప్రాంతానికి తరలించాలని భావిస్తుండగానే మాయం..

ఓ విమానంలో నుంచి అధికారులు కంటైనర్ ను దించారు. అందులో బంగారం ఉందని సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. కానీ ఆలోపే ఆ కంటైనర్ దొంగతనానికి గురయ్యింది. 

Gold container theft from airport.. Huge theft in Canada..ISR
Author
First Published Apr 21, 2023, 1:07 PM IST

కెనడాలో భారీ దొంగతనం జరిగింది. టొరంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నుంచి బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్న కంటైనర్ చోరీకి గురయ్యింది. వాటి విలువ 20 మిలియన్ కెనడియన్ డాలర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ భారీ చోరీ ఈ నెల 17వ తేదీన జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అతిక్ అహ్మద్ తుపాకీ చూసి ప్యాంట్ లో మూత్రం పోసుకున్నాడు - ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన మాజీ పోలీస్ ఆఫీసర్

ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సోమవారం కంటైనర్ ను విమానంలో నుంచి దించారు. చాలా విలువైన వస్తువులు ఉన్నాయని భావించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే దానిని అక్కడికి తరలించే క్రమంలోనే అది మాయవడం గమనార్హం. అయితే ఈ కంటైనర్ ను ఎవరు పంపిచారు ? ఎక్కడి నుంచి వచ్చింది ? అనే వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ చోరీ జరిగి మూడు రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులూ జరగలేదు.

ట్విట్టర్ లో బ్లూ టిక్ కోల్పోయిన యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖాతాలు.. ఎందుకంటే ?

కాగా.. ఎయిర్ పోర్టులో ఇంత పెద్ద దొంగతనం గతంలోనూ జరిగింది. 1952 సంవత్సరంలో భారీ చోరీ వెలుగు చూసింది. ఆ సమయంలో 2.15 లక్షల డాలర్ల విలువ గల బంగారం మాయమైంది. ఇప్పుడు దాని విలువ 23 లక్షల డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఆ దొంగతనం ఎవరు చేశారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చోరీ అయిన బంగారం కూడా ఇంకా దొరకలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios