Asianet News TeluguAsianet News Telugu

ఒక్కమ్మాయి ఫుడ్ ఆర్డర్ చేస్తే.. 42మంది డెలివరీ బాయ్స్...

ఇంతమంది ఒకేసారి ఫుడ్ తీసుకుని వచ్చేసరికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతాన్ని అక్కడుంటున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

Girl Orders Food Online, 42 Riders Deliver Same Order
Author
Hyderabad, First Published Dec 3, 2020, 12:22 PM IST

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా కామన్ విషయం. దాదాపు అందరూ ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తూనే ఉంటారు.. డెలివరీ బాయ్స్ కూడా .. ఆర్డర్ చేసిన ఫుడ్ ని ఇంటికి తెచ్చి ఇస్తూ ఉంటారు. అయితే.. ఓ అమ్మాయి విషయంలో చాలా విచిత్రం జరిగింది. ఆ అమ్మాయి ఫుడ్ ఆర్డర్ చేస్తే.. దాదాపు 42 మంది అబ్బాయిలు ఫుడ్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఈ సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఫిలిప్పీన్స్‌లోని సెబూ సిటీలో స్కూలులో చదువుతున్న ఒక అమ్మాయి ఒక ఫుడ్ యాప్ సాయంతో లంచ్ ఆర్డర్ చేసింది. తరువాత తన నాయనమ్మతో కలసి ఆహారం తినేందుకు ఎదురు చూడసాగింది.

ఇంతలో ఆమె ఉంటున్న వీధిలోకి ఫుడ్ తీసుకుని ఏకంగా 42 మంది డెలివరీ బాయిస్ వచ్చారు. ఇంతమంది ఒకేసారి ఫుడ్ తీసుకుని వచ్చేసరికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతాన్ని అక్కడుంటున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

చూస్తుండగానే ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఆ ఫుడ్ యాప్‌లోని సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఆ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఒక డెలివరీ బాయ్‌కి చేరాల్సిన మెసేజ్ ఏకంగా 42 మందికి చేరింది. దీంతో వారంతా ఆహారం తీసుకుని ఆమె ఇంటికి తరలివచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios