నలుగురి చేతలో శేభాష్ అనిపించుకోవడానికి.. తనను తాను ప్రత్యేకంగా నిరూపించుకోవడానికి ఒక వ్యక్తి 100 మందిని చంపాడు. వివరాల్లోకి వెళితే.. నెయిల్స్ హోయ్‌జల్ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు.

నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలనే తపన అతనిలో ఎక్కువ. అంతేకాకుండా తాను దైవాంశ సంభూతుడినని ఫీలయ్యేవాడు. ఈ కోవలోనే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగులకు వైద్యం చేసేవాడు. వారు బతికితే సహోద్యోగులు, వైద్యుల దృష్టిలో హీరో అవ్వాలనే కోరుకునేవాడు. ఈ

నేపథ్యంలోనే ఆస్పత్రికి వచ్చే రోగులకు విషయం ఎక్కించి.. వారి గుండె పనిచేయకుండా చేసేవాడు. మళ్లీ తానే వైద్యం చేసి బతికించడానికి ప్రయత్నం చేసేవాడు. అయితే అతని చర్య విఫలమై సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హోయ్‌జోల్ 1972లో జన్మించాడని, 16 ఏళ్ల వయసులోనే స్థానిక ఆస్పత్రిలో నర్సుగా చేరాడు. వృత్తి రీత్యా చాలా సార్లు ఫెయిల్ అయినప్పటికీ .. సహోద్యోగులు, డాక్టర్ల దృష్టిలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.

ముఖ్యంగా మహిళా నర్సులు ఉన్నపుడు హోయ్‌జోల్ అతిగా ప్రవర్తించేవాడని తెలుస్తోంది. అతని చేతుల్లో ప్రాణాలు కోల్పోయినవారి బంధువులు హోయ్‌జోల్‌పై కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి గురువారం అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.