వాషింగ్టన్: అమెరికా  41వ, అధ్యక్షుడుగా పనిచేసిన  జార్జ్ హెచ్. డబ్ల్యు . బుష్ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు.

1989 నుండి 1993 వరకు ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ద సమయంలో  జార్జ్ హెఛ్. డబ్ల్యు బుష్ నేవీ పైలెట్‌గా పనిచేశారు. రోనాల్డ్ రీగన్‌ అధ్యక్షుడుగా పనిచేసిన సమయంలో బుష్  ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.

సీఐఏ డైరెక్టర్‌గా  రీగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడిగా  బుష్ కు పేరుంది.