పారిస్: వేరే దేశానికి చెందిన ప్రేమించినందుకు గాను ఓ మైనర్ అమ్మాయికి కుటుంబీకులే శిరో ముండనం చేశారు. దీన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మొత్తం ఐదుగురిని నిందితులను దేశం నుండి బహిష్కరించింది.

ఫ్రాన్స్ లోని బెసా‌న్ కాన్ నగరంలో గత రెండేళ్లుగా బోస్నియా దేశానికి చెందిన కుటుంబం నివాసం ఉంటుంది.ఈ కుటుంబానికి చెందిన మైనర్ యువతిని అదే భవనంలో ఉంటున్న సెర్బియా దేశానికి 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది.

ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. అమ్మాయి తల్లిదండ్రులు యువతిని శారీరకంగా చిత్రహింసలకు గురి చేశారు. అంతేకాదు ఆమెకు గుండు గీయించారు.ఈ విషయాన్ని ఆగష్టు మాసంలో మీడియా బయటపెట్టింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. విచారణకు ఆదేశించింది.

బాలికకు శిరోముండనం చేసిన ఘటనలో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురు సమీప బంధువులే పాల్పడినట్టుగా ప్రభుత్వం గుర్తించింది.బాలికకు గుండు చేయించిన ముగ్గురిని దేశం నుండి బహిష్కరిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ బాలిక బాగోగులను తామే చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేజర్ అయిన తర్వాత ఫ్రాన్స్ లోనే నివసించే హక్కు కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.