Asianet News TeluguAsianet News Telugu

బ్రెజిల్ లో విమాన ప్రమాదం : నలుగురు ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల దుర్మరణం

ఈ నెల మొదట్లో జరిగిన ఇండోనేషియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే బ్రెజిల్‌లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ విమానం కుప్పకూలి నలుగురు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. 
 

Four Palmas football players, club president killed in plane crash in Brazil - bsb
Author
Hyderabad, First Published Jan 25, 2021, 12:27 PM IST

ఈ నెల మొదట్లో జరిగిన ఇండోనేషియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే బ్రెజిల్‌లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ విమానం కుప్పకూలి నలుగురు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. 

బ్రెజిల్‌లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. పామాస్ ఫుట్‌బాల్ క్లబ్‌ అధ్యక్షుడితో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. విలానోవా జట్టుతో ఆట ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. 

టేకాఫ్‌ అవుతుండగా దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్​లో ఈ ప్రమాదం సంభవించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. టేకాఫ్‌ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలకూలడంతో ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. 

ఇండోనేషియా విమాన ప్రమాదం: రంగంలోకి 13 హెలికాఫ్టర్లు, 4,100 మంది సిబ్బంది...

మృతి చెందిన వారిలో అధ్యక్షుడు లుకాస్ మెయిరా, ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారి ఉన్నారు. పామాస్ ఫుట్‌బాల్ క్లబ్ ను 1997లో స్థాపించారు. ఇది బ్రెజిల్‌లోని నార్త్ ఫోర్ డివిజన్‌కు చెందిన క్లబ్. 

అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తీరుపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios