Asianet News TeluguAsianet News Telugu

మెక్సికో విమానాశ్రయంలో షాకింగ్ ఘటన.. అమెరికాకు వెళ్లే ఓ ప్యాకేజీలో 4 మానవ పుర్రెలు..

మెక్సికో విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్ అధికారులు ఓ బౌండ్ ప్యాకేజీలో మనిషి పుర్రెలు కనుగొన్నారు. ఆ మానవ పుర్రెల వయసు, గుర్తింపు.. దానికి సంబంధించిన వివరాలను నేషనల్ గార్డ్ తమ ప్రకటనలలో తెలుపలేదు. 

Four Human Skulls Discovered Inside US-Bound Package At Mexico Airport
Author
First Published Jan 2, 2023, 1:59 PM IST

మెక్సికో : మెక్సికో  విమానాశ్రయంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే ఓ ప్యాకేజీలో 4 మనిషి పుర్రెలను అధికారులు గమనించారు. దీంతో వారు షాక్ కు గురయ్యారు. ఈ మేరకు స్థానిక అధికారులు రాయిటర్స్‌కి వివరాలు తెలిపారు. నేషనల్ గార్డ్ నుండి వెలువడిన ఒక ప్రకటన ప్రకారం, సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డ్‌బోర్డ్ పెట్టెలో అల్యూమినియం ఫాయిల్‌ లో చుట్టబడిన పుర్రెలు బయటపడ్డాయి. ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ దగ్గర ఈ ప్యాకేజీని కనిపెట్టారు.

దేశంలోని అత్యంత హింసాత్మక ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రమైన మిచోకాన్ నుండి ప్యాకేజీ వచ్చింది. ఇది సౌత్ కరోలినాలోని మన్నింగ్‌లోని ఓ చిరునామాకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఈ మానవ పుర్రెల వయస్సు, గుర్తింపు.. ఎందుకు పంపుతున్నారు..లాంటి కారణాలు, దానికి సంబంధించిన వివరాలు నేషనల్ గార్డ్ తెలుపలేదు. 

ఆస్ట్రేలియా బీచ్‌లో హెలికాప్టర్లు ఢీ.. పలువురికి గాయాలు

ఇలాంటి మానవ అవశేషాలను ఒకచోటు నుంచి మరోచోటుకు పంపడానికి సర్ఠిఫైడ్ డాక్టర్ నుంచి ప్రత్యేక అనుమతి పత్రం తప్పనిసరిగా ఉండాలి. అయితే దీంతోపాటు అది లేదని వారు పేర్కొన్నారు. ఇదిలావుండగా, కెన్యా నుండి అమెరికాకు జిరాఫీ, జీబ్రా ఎముకలను తీసుకురావడానికి ప్రయత్నించినందుకు వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ఒక మహిళను అడ్డుకున్నారని కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) నివేదిక తెలిపింది. సెకండరీ సామాను పరీక్షలో ఎముకలు కనిపెట్టారు. కెన్యాలో ఎముకలు దొరికాయి. వాటిని సావనీర్‌లుగా ఉంచుకున్నట్లు మహిళ అధికారులకు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios