ట్విట్టర్ తన ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించుకోవడం పట్ల ఆ సంస్థ ఫౌండర్ జాక్ డోర్సే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రస్తుత స్థితికి తానే కారణం అంటూ, దీనికి అందరూ తనను క్షమించాలని కోరారు.
ప్రపంచ కుబేర వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్ ఇటీవల మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. వెను వెంటనే సంస్థకు ఆర్థిక భారంగా అనిపించిన అన్ని విషయాల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొట్టమొదటగా ఇండియాకు చెందిన సీఈవో పరాగ్ అగర్వాల్ ను ఇంటికి పంపించారు. అలాగే పలువురు ఉన్నత ఉద్యోగులను కూడా తొలగించారు. శుక్రవారం సంస్థలో అనేక ఉద్యోగాల్లో కోత విధించాడు. దాదాపు 50 శాతం మ్యాన్ పవర్ ను తగ్గించాడు.
దారుణం.. టీచర్ విధించిన పనిష్మెంట్ తట్టుకోలేక నాలుగో తరగతి బాలిక మృతి.. ఎక్కడంటే ?
ఈ నేపథ్యంలో ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కంపెనీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. తనపై అనేక మంది కోపంగా ఉండి ఉంటారని, దానికి తనను ఉద్యోగులందరూ క్షమించాలని ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘‘గతం, ప్రస్తుతం ఉన్న ట్విటర్ ఉద్యోగులు చాలా బలంగా, సమర్థవంతంగా ఉన్నారు. వారు ఎంత కష్టమైనా ఎప్పుడూ ఒక మార్గాన్ని కనుగొంటారు. ప్రస్తుత పరిస్థితికి చాలా మంది నాపై కోపంగా ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను. దీనికి నేను బాధ్యత వహిస్తాను. నేను కంపెనీ పరిమాణాన్ని, ఉద్యో గుల సంఖ్యను చాలా త్వరగా పెంచాను. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. ’’అని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాద నిధుల కేసు.. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
‘‘ట్విట్టర్ లో పని చేసిన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞత, ప్రేమను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీ నుంచి అది వస్తుందని నేను ఆశించడం లేదు. ఎందుకు రాదో కూడా నేను అర్థం చేసుకుంటాను’’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. గత వారం ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్, చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్, బోర్డు మెంబర్స్ తో పాటు 7,500 మంది ఉద్యోగులలో సగం మందిని తొలగించారు. ఈ చర్యపై ఆయన గత వారమే ఓ ట్వీట్ చేశాడు. ట్వీట్టర్ ఆదాయలో భారీ పతనాన్ని అనుభవిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
2006 సంవత్సరంలో జాక్ డోర్సీ సోషల్ నెటవర్క్ సైట్ ట్విట్టర్ స్థాపించాడు. ఆయన ఈ ఏడాది మే లో ఆ సంస్థతో ఉన్న బంధానికి అధికారికంగా స్వస్తి చెప్పి ట్విట్టర్ బోర్డు నుంచి వైదొలిగాడు. 2007 నుంచి ఆయన ట్విట్టర్ బోర్డు డైరెక్టర్ గా వ్యహరించారు. 2015 మధ్య నుంచి గత ఏడాది వరకు ఆయన ఈ సంస్థకు సీఈవో గా కొనసాగారు. తరువాత ఇండియాకు చెందిన పరాగ్ అగర్వాల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
Old Monk Tea: తందూరీ చాయ్‌లో ఓల్డ్ మంక్ రమ్ పోసి అమ్ముతున్న గోవా వ్యాపారి.. వీడియో వైరల్
ఎలోన్ మస్క్ కు చెందిన ఎక్స్ హోల్డింగ్స్ 1 సంస్థ సుమారు 18 మిలియన్లకు పైగా ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేసిన తరువాత జాక్ డోర్సే ఆ కంపెనీలో పరోక్ష వాటాదారుగా కొనసాగుతున్నారు. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడాన్ని ఆయన సమర్థించారు. ప్రస్తుతం డోర్సే తన కొత్త సోషల్ మీడియా అప్లికేషన్ ‘బ్లూస్కీ’ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. కాగా.. సోషల్ మీడియా దిగ్గజం కోసం ఇదే విధమైన వికేంద్రీకృత భావనను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి బ్లూస్కీని మొదట 2019లో ట్విట్టర్ స్థాపించింది.
