న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా రాజకీయ నాయకురాలు ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. కొన్నేళ్లపాటు ఆండ్రూ క్యూమో తనను లైగింకంగా వేధించారని లిండ్సే బోయ్లాన్ పేర్కొన్నారు. 

‘ఆండ్రూ క్యూమో అడ్మినిస్ట్రేషన్‌లో పని చేసిన సమయంలో కొన్ని సంవత్సరాలపాటు ఆయన నన్ను లైగింకంగా వేధించాడు. ఆయన నన్ను వేధించడాన్ని చాలా మంది చూశారు. ప్రపంచలో చాలా మంది మహిళలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసు. క్యూమో వంటి కొంత మంది పురుషులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేను ద్వేషిస్తున్నాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా.. క్యూమో అడ్మినిస్ట్రేషన్‌లో లిండ్సే బోయ్లాన్.. 2015 నుంచి 2018 వరకు పని చేశారు. అయితే ఈ ఆరోపణలపై క్యూమో ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది.