పెరూ దేశంలో రన్ వే పై ఓ విమానం ల్యాండ్ అవుతుండగా దారుణ ప్రమాదం జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఓ ట్రక్ ఎదురుగా రన్ వే పై వచ్చింది. విమానం ఎదురుగా వస్తున్నదని గ్రహించి ట్రక్ పక్కకు తప్పుకుంటున్న లోపే ఆ ఫ్లైట్ వచ్చి ఢీకొంది.  

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టులో ప్రతి వెహికిల్ ఎంతో కేర్‌గా వెళ్లుతూ ఉంటుంది. అదీ ముఖ్యంగా రన్ వే పై ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులోనైతే విమానాలు ఎప్పుడు టేకాఫ్ తీసుకుంటాయో.. ల్యాండ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అత్యంత వేగంగా రన్ వే పై పరుగులు పెట్టే విమానాన్ని ఏ కొంత ఢీకొన్నా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టే, రన్ వే పై అంత జాగ్రత్త ఉంటుంది. కానీ, పెరూలో ఓ అగ్నిమాపక యంత్రం రన్ వే పై విమానానికే ఎదురెళ్లింది. ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో అది ఎదురుగా వచ్చింది. దీంతో ఫ్లైట్ నేరుగా ఆ వెహికిల్‌ను ఢీకొట్టింది.

పెరూలోని జార్జ్ చావెజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో విమాన ప్రయాణికులకు, విమాన సిబ్బంది ప్రాణాలకు నష్టమేమీ కలుగలేదు. కానీ, ఇద్దరు ఫైర్ ఫైటర్స్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Scroll to load tweet…

Also Read: ఆఫ్రికాలో ప్లేన్ క్రాష్.. టాంజానియాలో సరస్సులో కూలిన విమానం.. 26 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది

లాటామ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320నియో ఫ్లైట్ జార్జ్ చావెజ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ ఎదురుగా వస్తున్నట్టు గమనించిన ట్రక్ డ్రైవర్ అప్పుడే వెహికిల్‌ను పక్కకు తప్పించే ప్రయత్నం చేసినట్టు వీడియోలో తెలుస్తున్నది. కానీ, అంతలోపే ఆ విమానం వచ్చి ఢీకొట్టింది.ఆ ట్రక్‌ను ఢీకొని విమానం అలాగే ముందుకు వెళ్లింది. మంటలు, పొగలు చిమ్ముతూ అంతే వేగంతో ఫ్లైట్ వెళ్లి ఆగింది. ఆ ఫ్లైట్ రెక్కలు, ఫ్యూజ్‌లెజ్‌ తీవ్రంగా గాయపడింది. ఫ్యూజ్‌లెజ్ నుంచి మంటలూ వచ్చాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 102 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. 

Scroll to load tweet…

ఈ ఘటన కారణంగా ఎయిర్‌పోర్టులో అన్ని ఆపరేషన్స్ నిలిపేశారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జార్జ్ చావెజ్ ఎయిర్‌పోర్టును ఆపరేట్ చేసే కంపెనీ లిమా ఎయిర్‌పోర్ట్ పార్ట్‌నర్స్ ఈ ఘటనపై స్పందించింది. ఇక్కడ ఆపరేషన్స్ సస్పెండ్ చేసినట్టు వివరించింది. ప్రయాణికులకు అవసరమైన కేర్ అందించడానికి తమ బృందాలు వెళ్లాయని పేర్కొంది. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నారని వివరించింది.