చికాగో: అమెరికా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ వేర్ హౌస్ లో సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. 

పశ్చిమ షికాగోకు 65 కి.మీల దూరంలోని అరోరా ప్రాంతంలోని పైపులకు సంబంధించిన వాల్వుల తయారీ పరిశ్రమలో ఈ సంఘటన జరిగింది. అదే కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్‌ అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. 

సాయుధుడు ఎందుకు కాల్పులు జరిపాడనేది తెలియలేదు. సాయుధుడిని 45 ఏళ్ల గారీ మార్టిన్ గా గుర్తించారు. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో అతను ఉద్యోగి.

ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‌లో 17 మంది చిన్నారులను ప్రాణాలను బలిగొన్న ఘటన జరిగి ఏడాది పూర్తయిన మరుసటి రోజే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.