Asianet News TeluguAsianet News Telugu

Omicron Death in US: అగ్రరాజ్యం అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం.. కరోనా కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్‌వే..

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ 90కి పైగా దేశాలకు వ్యాప్తి చెందింది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం (Omicron Death) నమోదైంది. 

first Omicron related death reported in us
Author
Houston, First Published Dec 21, 2021, 1:12 PM IST

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ 90కి పైగా దేశాలకు వ్యాప్తి చెందింది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగుచూసినప్పటికీ.. యూరప్ దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా, 104 మంది ఆస్పత్రిలో చేరారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం (Omicron Death) నమోదైంది. టెక్సాస్ రాష్ట్రం హర్రిస్ కౌంటీలో సోమవారం ఓ వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ మృతిచెందిన వ్యక్తి వయసు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే ఆ వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకోలేదని, గతంలో కోవిడ్ బారినపడ్డారని తెలిపింది. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ సోకడంతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టుగా చెప్పింది. 

అయితే దీనిపై యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) మాత్రం స్పందించలేదు. మరోవైపు హారిస్‌ కౌంటీ న్యాయమూర్తి లీనా హిడాల్గో (Lina Hidalgo) యూఎస్‌లో ఒమిక్రాన్ తొలి మృతిపై విచారణం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు.  

Also read: బైడెన్ తో విమానంలో ప్రయాణించిన వైట్ హౌస్ ఉద్యోగికి కరోనా.. !

యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో.. ఇతర వేరియంట్‌ల కంటే ఒమిక్రాన్‌వే అధికంగా ఉన్నాయని సీడీసీ సోమవారం తెలిపింది. యూఎస్‌లో గత వారం రోజుల్లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌లలో 73 శాతం ఒమైక్రాన్ వేరియంట్‌వేనని పేర్కొంది. 

 

డేల్టా కంటే వేగంగా..
ఒమిక్రాన్ వ్యాప్తికి సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  (World Health Organization) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అత్యంత ప్ర‌మాక‌ర‌మైన వేరియంట్‌గా భావిస్తున్న క‌రోనా కొత్త వేరియంగ్ ఒమిక్రాన్ గురించి పూర్తి స‌మాచారం అందుబాటులో లేద‌ని WHO చీఫ్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియేస‌స్ పేర్కొన్నారు.  ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తోందనడానికి ప్ర‌స్తుతం ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యానికి రావ‌డానికి మ‌రింత డేటా కావాల్సింది ఉంద‌ని తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ద‌ని రుజువుల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.  ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతున్న బ్రిట‌న్‌, ఫ్రాన్స్ వంటి ప‌లు దేశాల ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావిస్తూ.. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచమంతా వ్యాపిస్తుండడంతో, అది మరింత వ్యాపించకుండా ప్రజలు సెలవు దినాల్లో కొన్ని వేడుకలను రద్దు చేసుకోవాలని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios