అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ల మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ వాడివేడిగా సాగింది. ఈ ముఖాముఖి సందర్భంగా జో బైబెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో కలుగజేసుకునే దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

తాను స్పష్టంగా చెబుతున్నానని.. అమెరికా ఎన్నికల విషయంలో కలుగజేసుకునే ఏ దేశమైన కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు తాను ఏ దేశం నుంచి కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేదన్నారు. రష్యా, చైనా సహా అనేక దేశాల్లో ట్రంప్ కి వ్యాపారాలు ఉన్నాయన్నారు. రష్యా, చైనా నుంచి ట్రంప్ కి భారీగా ఆర్థిక సాయం అందుతోందన్నారు. చైనాలో ట్రంప్ కి రహస్య ఖాతాలు ఉన్నాయని ఆరోపించారు.

కాగా.. దానికి భిన్నంగా ట్రంప్ కూడా వాధించారు. ‘‘రష్యా నుంచి బైడన్‌కు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుతోంది. కరోనాకు కారణం చైనానే. అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గింది. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో అమెరికా ముందంజలో ఉంది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నా. కొన్ని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. ఆర్మీ సాయంతో వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తా’’మన్నారు.

కాగా.. ఈ డిబెట్ లో కరోనా మీద కూడా చర్చ జరిగింది. కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్నిదేశాల్లో కన్నా ఎక్కువగా అమెరికాలోనే ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ విషంయలో ట్రంప్, బైడెన్ మధ్య పెద్ద డిస్కషనే జరిగింది.

మెరికాలో కరోనా మరణాల రేటు తగ్గిందని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. కొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆర్మీ సాయంతో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ట్రంప్ తెలిపారు. త్వరలోనే విద్య, వ్యాపార సంస్థలను తెరుస్తామన్నారు. 99 శాతం అమెరికా ప్రజలు వైరస్ నుంచి కోలుకున్నారన్న ట్రంప్ కరోనాకు చైనానే కారణమని స్పష్టం చేశారు.

కాగా.. కరోనాను నివారించడంలో ట్రంప్ విఫలమయ్యారని బైడెన్ ఆరోపించారు.. కరోనాను ఎదుర్కోవడానికి ట్రంప్ దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని కరోనా కేసుల్లో అమెరికా మొదటిస్థానంలో ఉండడానికి ట్రంప్ నిర్లక్ష్యమే కారణమన్నారు. కరోనా సోకిన ట్రంప్ మాస్క్‌ను కూడా చులకనగా చూశారని విమర్శించారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా గురించి ట్రంప్ పట్టించుకోలేదని చైనాకు రాకపోకలు నిషేధించడంలో ఆలస్యం వహించారని మండిపడ్డారు బైడెన్.