Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియా ట్రోల్స్ కు దొరికిన ట్రంప్ : ఆమె నిజం కాదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గతకొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలికలతో ఉన్న మరో మహిళను తీసుకెడుతున్నారంటూ  సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్  హల్ చల్ చేస్తున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Fake Melania Trump conspiracy spread by online trolls - bsb
Author
hyderabad, First Published Oct 26, 2020, 11:23 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గతకొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలికలతో ఉన్న మరో మహిళను తీసుకెడుతున్నారంటూ  సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్  హల్ చల్ చేస్తున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్‌లోని నాష్‌విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్‌కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది. 

ఎయిర్ క్రాఫ్ట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ ‘ఫేక్ మెలానియా’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్యాగ్ చేస్తున్నారు. 

 డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య ప్రథమ మహిళ మెలానియీ ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే మిలటరీ ఆసుపత్రిలో చికిత్స  అనంతరం కోలుకున్న ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.  విపరీతమైన దగ్గు కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలకమైన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ ఆమె ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios