Asianet News TeluguAsianet News Telugu

Afghanistan earthquake : తీవ్ర విషాదాన్ని మిగిల్చిన భూకంపం.. అంతర్జాతీయ సాయం కోరిన ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం విలయతాండవం సృష్టించింది. దీని నుంచి సొంతంగా కోలుకోవడం ఆ దేశానికి కష్టంతరంగా మారనుంది. దీంతో తాలిబన్ దేశం అంతర్జాతీయ దేశాల సాయం కోరింది. 

Extremely tragic earthquake .. Afghanistan seeks international help
Author
New Delhi, First Published Jun 23, 2022, 2:24 PM IST

ఆఫ్ఘనిస్తాన్ లో బుధ‌వారం తెల్ల‌వారు జామున సంభ‌వించిన భూకంపం ఘోర న‌ష్టాన్ని మిగిలిచ్చింది. దాదాపు రెండు ద‌శాబ్దాల త‌రువాత సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపంలో 1,000 మందికిపైగా మ‌ర‌ణించారు. అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో చాలా మంది ప్రాణ‌ప్రాయ స్థితిలో ఉన్నారు. క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో విధ్వంసం జ‌ర‌గ‌డంతో తాలిబ‌న్ దేశం అంత‌ర్జాతీయ సాయం కోరుతోంది. 

సీఎంగా వైదొలగాలని కోరట్లేదు.. రెండున్నరేళ్లుగా మాకు సీఎం కలువలేదు: ఉద్ధవ్‌కు రెబల్ ఎమ్మెల్యేల లేఖ

భూకంపం వ‌ల్ల తాలిబ‌న్ దేశంలో గురువారం నాటికి మృతుల సంఖ్య వెయ్యి దాటింది. 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఖోస్ట్ ప్రావిన్స్ లోని స్పెరా జిల్లా, పక్తికా ప్రావిన్స్ లోని బర్మలా, జిరుక్, నాకా, గయాన్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. యుద్ధంతో దెబ్బతిన్న దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. గత ఏడాది అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల ఉపసంహరణ తరువాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు ఖోస్ట్, పక్తికా ప్రావిన్సులకు ఈ విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం లేద‌ని ఇస్లామిక్ నాయకత్వం తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ఆఫ్ఘనిస్తాన్ కు సాయం చేసేందుకు ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే ఐక్యరాజ్యసమితి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రపంచంలోని అతిపెద్ద మానవతా కార్యకలాపాలలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలు అంటే జనాభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు. యుఎన్ హెచ్ సీఆర్, యుఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ, ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన ఘోరమైన భూకంపం విషాదకరమైన పరిణామాలను చూసి విచారం వ్యక్తం చేసింది.

maharashtra crisis: మహా సంక్షోభంలో ట్విస్ట్.. గౌహతీలో శివసేన ఎమ్మెల్యేల బలప్రదర్శన

యుఎన్ హెచ్ సీఆర్, ఇతర ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు గార్డెజ్ లోని తన క్షేత్ర కార్యాలయం నుండి పకిటికా, ఖోస్ట్ ప్రావిన్సులలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలకు సిబ్బందిని పంపించాయి. ప్రస్తుతం ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి, అలాగే సహాయక చర్యలపై దృష్టి కేంద్రీకరించింది, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రాణాలతో బయటపడిన వారిని అత్యవసరంగా చేరుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు ఉన్నాయి.

గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత.. అనేక అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాయి. దీంతో రెస్క్యూ ప్రయత్నాలు క్లిష్టంగా మారాయి. మరోవైపు భూకంపం సంభవించింది మారుమూల ప్రాంతాలు కావడంతో.. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ సిబ్బంది హెలికాఫ్టర్లలో చేరుకోవాల్సి వచ్చింది. గాయపడిన వారిని హెలికాఫ్టర్‌లలో అక్కడి నుంచి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios