ఇరాన్: టెహ్రాన్ మాజీ మేయర్, ఇరానీయన్ ఉపాధ్యక్షుడు  మహ్మద్ అలీ నజాఫీని పోలీసులు అరెస్ట్ చేశారు.

మహ్మద్ అలీ నజాఫీ తన భార్యను హత్య చేశాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసుల ముందు కూడ ఒప్పుకొన్నాడు.  మహ్మద్ అలీ నజాపీకి అతని భార్య మితత్ర నజాపీకి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి.దీంతో ఆమెను హత్య చేసినట్టుగా మహ్మద్ పోలీసుల ముందు ఒప్పుకొన్నట్టుగా ఇరానీ స్టేట్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.

టెహ్రాన్‌లో మిత్రా నజాపీ మంగళవారం నాడు హత్యకు గురైంది. 2018లో నజాపీ టెహ్రాన్ మేయర్ పదవికి రాజీనామా చేశారు. యువతులతో కలిసి డ్యాన్స్ చేసిన విషయమై తీవ్రమైన విమర్శలు చేలరేగడంతో  మేయర్ పదవికి  రాజీనామా చేశారు.

నజాఫీ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ అడ్మినిస్ట్రేషన్‌లో ఏడు మాసాల పాటు పనిచేశారు. తన రాజకీయ జీవితంలో నఫాజీ పలు మంత్రిత్వశాఖలను నిర్వహించారు.

నజాఫీ తన తుపాకీని  అప్పగించాడని  టెహ్రాన్ పోలీసు డిపార్ట్ మెంట్ హెడ్ జనరల్ అలీ రేజా లోట్జీ చెప్పారు.నజాఫీ  తన భార్యపై  ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇందులో రెండు బుల్లెట్లు నజాఫీ శరీరంలోకి దూసుకుపోయాయని పోలీసులు తెలిపారు. నఫాజీ నివాసంలోని బెడ్‌రూమ్‌లో మిత్రా నజాపీ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.