జోహన్స్‌బర్గ్:  ఏస్వాతీనీ దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మాండ్వులో లామిని కరోనాతో మరణించారు.నాలుగు వారాల క్రితం ఆయనకు కరోనా సోకింది. ఆయన వయస్సు 52 ఏళ్లు. కరోనా చికిత్స కోసం ఆయన దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రధాని అంబ్రోస్ మరణించినట్టుగా  ఏస్వాతీనీ ఉప ప్రధాని థెంబా ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో చెప్పారు. 

కరోనా సోకిన తర్వాత అంబ్రోస్ డిసెంబర్ 1వ తేదీన దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో చేరాడు.  2018 నవంబర్ మాసంలో ఆయన ఏస్వాతీనీ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.ప్రధానమంత్రి కాకముందు  ఆయన బ్యాంకింగ్ పరిశ్రమలో 18 ఏళ్ల పాటు పనిచేశారు. ఏస్వాతీనీలోని నెడ్ బ్యాంకుకు ఎండీగా కూడా ఆయన పనిచేశారు.

దక్షిణాఫ్రికా దేశం జనాభా 1.2 మిలియన్లు. ఇప్పటివరకు 6,768 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 127 మంది మరణించారు.కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని గతంలో అనేక ఘటనలు నిరూపించాయి. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.