లండన్: బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశంలో నాలుగు వారాల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

శనివారం నాడు నిర్వహించిన కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఈ  ఏడాది డిసెంబర్ 2వ తేదీ వరకు దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.

శనివారం నాడు ఒక్క రోజే దేశంలో 22 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. యూకేలో ఇప్పటవరకు కరోనా కేసులు 10 లక్షలకు చేరుకొన్నాయి. కరోనా కేసులు మరోసారి పెరిగి పోవడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై ప్రధాని సీనియర్ మంత్రుల సలహా తీసుకొన్నారు.ఫ్రాన్స్ లో కూడ రెండోసారి లాక్ డౌన్ ను  ఆ దేశం ప్రకటించింది. శుక్రవారం నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో గురువారం నాడు లక్షలాది మంది జనం తమ స్వంత గ్రామాలకు వెళ్లారు.