Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పై ఇండియన్ విద్యార్థి పరువు నష్టం కేసు

హోతి దాఖలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందనే మస్క్​ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో మస్క్‌కు కోర్టులో చుక్కెదురైనట్లైంది. 

Elon Musk Loses Round One Vs Indian American Student Who Sued Him
Author
Hyderabad, First Published Jan 30, 2021, 1:21 PM IST

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్ పై ఓ విద్యార్థి కేసు వేయడం గమనార్హం. రణదీప్ హోతి అనే భారత సంతతి విద్యార్థి.. తన పరువుకి నష్టం వాటిల్లిందంటూ ఎలన్ మస్క్ పై కేసు పెట్టడం విస్మయానికి గురిచేసింది.

ఈ మేరకు సదరు విద్యార్థి అమెరికాలోని ఓ న్యాయస్థానంలో దావా వేశాడు. కాగా.. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. అయితే, హోతి దాఖలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందనే మస్క్​ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో మస్క్‌కు కోర్టులో చుక్కెదురైనట్లైంది. 

వివరాల్లోకి వెళ్తే.. రణదీప్ హోతి బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేట్​ విద్యార్థి. 2019 ఫిబ్రవరిలో ఫ్రీమోంట్​లోని టెస్లా ఆటో ప్లాంట్‌లోకి విద్యుత్ కార్లపై అధ్యయనం కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది హోతిని అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, హోతి మధ్య చిన్న ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్​లో హోతి కారులో వెళ్తూ టెస్లా టెస్టు కారు ఫొటోలు తీశాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్​ చేశాడు. ఈ రెండు సంఘటనలు మస్క్​‌ను ఆగ్రహాం తెప్పించాయి. ఈ నేపథ్యంలో హోతిపై మస్క్ ఆన్​లైన్​ టెక్​ ఎడిటర్​కు ఫిర్యాదు చేశారు. హోతి తన కారులో దూసుకురావడంతో పాటు తమ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగా అతడు అబద్ధాలకోరని తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios