Asianet News TeluguAsianet News Telugu

గ్యాస్‌పైప్‌లైన్ పేలుడు: 11మంది మృతి, 138మందికి గాయాలు

 చైనాలో గ్యాస్ పైప్‌లైన్  పేలుడు ఘటనలో 12 మంది మరణించారు. ఈ ఘటనలో 138 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Eleven people dead after gas pipeline explosion in China lns
Author
China, First Published Jun 13, 2021, 2:56 PM IST


బీజింగ్: చైనాలో గ్యాస్ పైప్‌లైన్  పేలుడు ఘటనలో 12 మంది మరణించారు. ఈ ఘటనలో 138 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుబీ ప్రావిన్స్ లోని షియాన్ నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  ఈ ఘటనలో సుమారు 150 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ పేలుడు కారణంగా ఉదయం ఆరున్నర గంటలకు ఆహార మార్కెట్  భవనం కుప్పకూలిపోయింది. గ్యాస్ పైప్‌లైన్ పేలుడుతో  ఫుడ్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో కొందరు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. సమీపంలోని దుకాణాల్లో స్థానికులు సరుకులు కొనుగోలు చేస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి.  ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన వారికి అవసరమైన రక్తం కోసం రక్తదానం చేయాలని ప్రజలను స్థానిక ఆసుపత్రులు కోరుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరిన వారి ఆరోగ్య పరిస్థితులు విషమంగా ఉన్నాయని వైద్యులు ప్రకటించారు.ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు అధికారులు.  ఈ పేలుడుతో పెద్ద ఎత్తున శిథిలమైన  భవనాల మధ్య ప్రజలు భయంతో పారిపోతున్న దృశ్యాలు  సీసీటీవీ పుటేజీలో రికార్దయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios