Asianet News TeluguAsianet News Telugu

3500 ఏళ్ల కిందటి మమ్మీ.. ఇప్పటికీ చెక్కుచెదరని పళ్ల వరస.. గదవ.. ఆ మమ్మీ చరిత్ర ఇదే!

క్రీస్తుపూర్వం 11వ శతాబ్దానికి చెందిన ఈజిప్టు ఫారో అమెన్‌హోతెప్ మమ్మీని పరిశోధకులు తాజాగా వెలికి తీశారు. వర్చువల్‌గానే ఈ మమ్మీని విప్పారు. 3500 కిందట ఈజిప్టు భాగాలను పాలించిన ఆ ఫారో బాడీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది. ఆయన పళ్లు, గదవ, ముక్కు ఇతర భాగాలు పటిష్టంగా ఉన్నాయి.

egypt pharaoh amenhotep 1 mummy unwrapped
Author
Cairo, First Published Dec 29, 2021, 1:23 PM IST

న్యూఢిల్లీ: ఈజిప్టు (Egypt).. పిరమిడ్లు (Pyramids).. మమ్మీలు (Mummy).. అంటేనే ఏదో మార్మికత ఆవరిస్తుంది. రహస్యాలు(Mystic), నమ్మకాలు, మూడు శతాబ్దాల కిందటి నాగరికత గురించిన ఆలోచనలు మెదులుతాయి. అప్పటి నైపుణ్యాలు, విశ్వాసాలు, రాజ్యాల చుట్టూ చర్చ మొదలవుతుంది. ఇప్పుడు మరోసారి ఆ చర్చ మొదలైంది. 3500 ఏళ్ల కిందటి మమ్మీని ఇప్పుడు తొలిసారిగా విప్పారు. అయితే, నేరుగా కాకుండా వర్చువల్‌గా మమ్మీని అన్‌రాప్ చేశారు. ఆ మమ్మీ ఈజిప్టు భూభాగాలను క్రీస్తు పూర్వం 1525-1504 సంవత్సరాలలో ఏలిన ఫారో (Pharaoh) (చక్రవర్తి) ఒకటో అమెన్‌హోతెప్‌ది.

డిజిటల్‌గా సిటిస్కాన్‌లను ఉపయోగించి ఆ మమ్మీని అన్‌రాప్ చేశారు. ఈ పరిశోధనలో మమ్మీ భౌతిక ఆకృతి, ఆరోగ్యం, మరణానికి గల కారణాలు, మమ్మిఫికేషన్ విధానంపై ఫోకస్ పెట్టారు. ఈ వివరాల ప్రకారం ఫారో ఒకటో అమన్‌హోతెప్ 35 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన 169 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నాడు. మరణించేటప్పుడు ఆయన భౌతికంగా ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తున్నది. మంచి శరీర సౌష్టవంతో ఉన్నాడు. ఆయన పళ్లు, గదవ, సన్నని ముక్కు, ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆయనకు మెలికలు తిరిగే వెంట్రుకలు ఉండేవని, తన తండ్రితో ఈయనకు చాలా పోలికలు ఉన్నాయని తెలిసింది. రోగాలు, గాయాలతో ఆయన మరణించినట్టుగా ఆయన బాడీపై చిహ్నాలు లేవని పరిశోధకులు చెప్పారు. అయితే, పోస్టుమార్టం నిర్వహించడం, దొంగల బారిన పడిన కారణంగా ఏర్పడ్డ కొన్ని గాట్లు ఆయన బాడీపై ఉన్నాయని వివరించారు. తొలిసారి మమ్మిఫై చేసినప్పుడే కడుపులోని ప్రేవులు.. ఇతరత్రాలను తొలగించారు. కానీ, ఆయన బ్రెయిన్, హృదయాన్ని బాడీలోనే ఉంచారని పేర్కొన్నారు. ఆయన బహుశా సహజంగానే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.

Also Read: వైరల్ : రెండువేల యేళ్లనాటి ఈజిప్టు మమ్మీ నోట్లో బంగారు నాలుక.. !!

పెద్ద పెద్ద పిరమిడ్లలో చక్రవర్తుల మృతదేహాలను అప్పటి రాజవంశీకులు భద్రపరిచేవారు. భవిష్యత్‌లో మరణించిన చక్రవర్తి మళ్లీ భూమి పైకి వస్తాడని, అప్పుడు ఆయనకు తన శరీరం అవసరం అవుతుందని భావించేవారు. అందుకోసమే ఆ శరీరాన్ని భద్రపరిచేవారనే చర్చ ఉన్నది. ఇదంతా అప్పుడు ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. పిరమిడ్‌లలో వారి భౌతిక దేహాలను భద్రంగతా మమ్మిఫికేషన్ చేసి భద్రపరిచేవారు. ఆ డెడ్ బాడీతోపాటు వారు ఉపయోగించిన వస్తువులనూ దగ్గరనే పెట్టేవారు. ఫారోలు.. దైవాంశ సంభూతులని వారి పాలనలో భావించేవారు. అయితే, అప్పట్లోనే కాదు.. ఇటీవలి కాలం వరకూ పిరమిడ్‌లపై దొంగల చూపు ఉండేది. పిరమిడ్‌లలో ద్వారాలు ధ్వంసం చేసి మమ్మీలను దాచిన గదుల్లోకి చొరబడేవారు. విలువైన వస్తులను దోచుకెళ్లేవారు. ఒక్కోసారి మమ్మీలను ధ్వంసం చేసేవారు.

Also Read: 2,500 యేళ్ళైనా చెక్కు చెదరని ‘మమ్మీ’..

తాజాగా అన్‌రాప్ చేసిన అమెన్‌హోతెప్ డెడ్ బాడీని ఖననం చేసినప్పుడు దొంగలు దాడి చేశారు. అందుకే మరో రాజు.. అమెన్‌హోతెప్ డెడ్ బాడీని వెలికి తీసి మళ్లీ మమ్మిఫికేషన్ చేసి భద్రపరిచాడు. ఈ మమ్మీని అధికారులు తొలిసారిగా 1881లో గుర్తించారు. లక్సర్‌లోని డెర్ ఎల్ బహారి రాయల్ కేచ్‌లో ఈయన మమ్మీ లభించింది. దొంగల నుంచి కాపాడటానికి రాజవంశస్తుల మమ్మీలను ఇక్కడికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ మమ్మీలు అంటే ఆసక్తి కొనసాగుతూనే ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios