ప్రాచీన మానవ నాగరికత విలసిల్లిన దేశాల్లో ఈజిప్టు కూడా ఒకటి. ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతకు కేంద్రంగా ఉన్న ఈజిప్టులో నాటి చారిత్రక అవశేషాల కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పురాతత్వ శాస్త్రవేత్తలు మరిన్ని మమ్మీలను కనుగొన్నారు.

తూర్పు మల్లావిలో టునా ఎల్ గెబల్ అనే ఒక ప్రదేశంలో తవ్వకాలు జరుపుతుండగా దాదాపు తొమ్మిది మీటర్ల లోతైన గదులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో దాదాపు 50 మమ్మీలు బయటపడ్డాయి. అవి క్రీస్తు పూర్వం 305 కాలంలో విలసిల్లిన రోమన్ లేదా బైజాన్టియన్ కాలం నాటిగా భావిస్తున్నారు.

వీటిలో 6 జంతువుల కళేమరాలు కూడా కనిపించాయి. ఆ కాలంలో పెంపుడు జంతువులు చనిపోతే, వాటిని కూడా మమ్మీలుగా మారుస్తారని ఈ సంఘటనతో స్పష్టమవుతోంది. కొన్ని మమ్మీలపై నాటి ఈజిప్షియన్ భాషలో కొన్ని విషయాలు రాశారు.

ఇప్పటి వరకు మమ్మీలను శవపేటికలలో మాత్రమే భద్రపరిచేవారని భావించాం..కానీ కుండల్లో సైతం దాచేవారని అర్థమవుతోంది. చనిపోయిన వాళ్లు ఆత్మ రూపంలో మరలా తిరిగి వస్తారని, తమ శరీరం వద్ద సంచరిస్తారని ప్రాచీన ఈజిప్షియన్లు నమ్మేవారు.

అందుకే వారు చనిపోయిన వాళ్లను మమ్మిఫికేషన్ చేసేవాళ్లు.. మనిషి చనిపోయాకా.. శరీరంలో కుళ్లిపోపయే అవయవాల్ని తొలగించి.. కొన్ని రసాయనాల పోసేవారు. ఆ మృతదేహాన్ని తెల్లటి వస్త్రాలతో చుట్టేవారు.

దీంతో శవంలోని నీరు మొత్తం ఎండిపోయేది...ఈ ప్రక్రియకు సుమారు 70 రోజులు పడుతుంది. మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి.. చనిపోయిన వ్యక్తి వాడిన వస్తువుల్ని, ఆభరణాల్ని అందులో పెట్టి .. పూడ్చివేసేవారు.