జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. హోక్కైడో దీవిలో ఈ ఉదయం ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ప్రకంపనల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. హోక్కైడో దీవిలో ఈ ఉదయం ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ప్రకంపనల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి..అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
దీవి మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ దీవిలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను కూడా స్విఛాప్ చేశారు. టొమోకొమై సిటీ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 125 మంది గాయపడగా.... మరో 25 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి.
Last Updated 9, Sep 2018, 2:09 PM IST