జపాన్‌లో భూకంపం.. భారీ విధ్వంసం

earthquake in japan
Highlights

జపాన్‌లో భూకంపం.. భారీ విధ్వంసం

జపాన్‌లో భూకంపం చోటు చేసుకుంది.. ఒకాసా నగరంలో ఈ ఉదయం  భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు జపాన్ భూభౌతిక శాఖ తెలిపింది.. భూకంపం దాటికి నగరంలోని చాలా చోట్ల భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా.. 90 మంది వరకు గాయపడినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. సహాయ పునరావాస చర్యల కోసం రెస్క్యూటీమ్‌లను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా బుల్లెట్ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

loader