ఇండోనేషియాలో భూకంపం.. ఆసియా క్రీడల వేదికల వద్ద ప్రకంపనలు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 28, Aug 2018, 3:53 PM IST
earthquake in indonesia
Highlights

గత కొద్దిరోజులుగా వరుస భూకంపాలతో వణికిపోతున్న ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు

గత కొద్దిరోజులుగా వరుస భూకంపాలతో వణికిపోతున్న ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

మరోవైపు 18వ ఆసియా క్రీడలకు ఇండోనేషియా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రీడలు జరుగుతున్న జకార్త, పలేంబాగ్ ప్రాంతాలతో టీమర్ ఐస్‌లాండ్, కుపాంగ్‌లలో భూమి కంపించింది. ఈ ఏడాది వరుసగా సంభవించిన భూకంపాల కారణంగా ఇండోనేషియాలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 

loader