న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్ లోని హిందు కుశ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై భూకంపం 6.1గా నమోదైంది. సాయంత్రం 5.34 నిమిషాల ప్రాంతంలో ఉత్తర కాబూల్ కేంద్రం భూకంపం చోటు చేసుకుంది. 

భూకంపం 212 కిలోమీటర్ల లోతులో నమోదైంది. అఫ్గానిస్తాన్ లో సంభవించిన భూకంపం వల్ల భారత రాజధాని ఢిల్లీలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.