ఇండోనేషియాలో భూకంపం.. 10 మంది మృతి

First Published 29, Jul 2018, 12:14 PM IST
earthquake hits indonesia
Highlights

భూకంపం దాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం లోమ్‌బాక్‌లో  భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది

భూకంపం దాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం లోమ్‌బాక్‌లో  భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా... 33 మంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది.

భూకంపం ధాటికి ఇల్లు నేలమట్టమయ్యాయి.. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. లోమ్‌బాక్ దీవుల్లోని మాతరమ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు.

loader