Asianet News TeluguAsianet News Telugu

ఆ ధర వింటే దిమ్మతిరగాల్సిందే.. ఒక్క బంగారునాణెం రూ. 142 కోట్లు.. ఎందుకంటే..

అమెరికా బంగారునాణెం ‘డబుల్ ఈగల్’కు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 142 కోట్ల ధర పలికింది. ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జమన్ కు చెందిన ఈ నాణేన్ని మంగళవారం వేలం వేశారు.

Double Eagle gold coin sells for record-setting $18.9 million - bsb
Author
Hyderabad, First Published Jun 9, 2021, 10:17 AM IST

అమెరికా బంగారునాణెం ‘డబుల్ ఈగల్’కు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 142 కోట్ల ధర పలికింది. ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జమన్ కు చెందిన ఈ నాణేన్ని మంగళవారం వేలం వేశారు.

20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారుచేసినా.. తీవ్ర ఆర్తిక మాంధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ డబుల్ ఈగల్ నాణాలను చలామణికి విడుదల చేయకుండా ఆపేశారు. 

నాణాలను కరిగించమని ఆదేశించారు. అప్పుడు బైటికి వచ్చిన రెండు నాణాలలో ఇదొకటి. డబుల్ ఈగిల్ మీద ఒక వైపు లేడీ లిబర్టీ, రెండో వైపు అమెరికన్ ఈగిల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 

1794కు చెందిన ‘ఫ్లోయింగ్ హెయర్’ వెండి నాణెం 2013లో 73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణెంగా రికార్డుల్లోకి ఎక్కింది. మంగళవారం డబుల్ ఈగిల్ రూ. 142 కోట్లు పలికి ఈ రికార్డును తిరగరాసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios