వాషింగ్టన్: అమెరికా ట్రంప్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రతినిధుల సభ తీర్మానించింది. త్వరలోనే సెనేట్ విచారణను ట్రంంప్ ఎదుర్కొననున్నారు.

అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు సృష్టించారు. ట్రంప్ కు వ్యతిరేకంగా డెమొక్రాట్లు ఓటు చేశారు. సెనేట్‌లో  రిపబ్లిక్ పార్టీకి మెజారిటీ ఉంది. దీంతో సెనేట్ లో ట్రంప్ ను అభిశంసించే అవకాశాలు తక్కువే. సెనేట్‌లో అభిశంసన ఆమోదం పొందితేనే అభిశంసన ప్రక్రియ పూర్తి కానుంది.

వచ్చే ఏడాది జనవరి మాసంలో ట్రంప్ పై సెనేట్ విచారణ జరగనుంది. 2020లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమొక్రాట్ నేత జోయ్ బైడన్ నుండి ట్రంప్ గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

బైడన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్దమైనట్టుగా ఆరోపణలు వచ్చాయి. బైడన్ కుమారుడు హంటర్ బైడన్ కు ఉక్రెయిన్ లో భారీగా వ్యాపారులున్నాయి. ఉక్రెయిన్ దేశానికి ట్రంప్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.