Asianet News TeluguAsianet News Telugu

వీడియోగేమ్ : గంటలో లక్ష గాయబ్.. కారు అమ్మి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న తండ్రి...

నార్త్ వేల్స్ కి చెందిన ఏడేళ్ల బాబు అషాజ్‌ తన తండ్రి ఐఫోన్లో ‘డ్రాగన్స్‌: రైజ్‌ ఆఫ్‌ బెర్క్‌’ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవెల్ దాటుకుంటూ పోతుండగా.. మధ్యలో వచ్చిన యాప్ యాడ్స్ ను క్లిక్ చేసుకుంటూ పోయాడు

Doctor is forced to sell car after his son, seven plays DreamWorks Dragons game on iPhone - bsb
Author
Hyderabad, First Published Jul 1, 2021, 12:01 PM IST

మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారా? మీ ఫోన్ లో పాస్ వర్డ్ తెలుసుకుని మరీ వీడియోగేమ్స్ ఆడుతున్నారా? అయితే ఏమేమీ డౌన్ లోడ్ చేస్తున్నారో.. గమనించారా? లేకపోతే మీరూ ఈ ఫాదర్ లా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.. 

వీడియో గేమ్ల పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్న కేసులు చూస్తూనే ఉన్నాం. అయితే అధికారిక గేమ్ వంకతో ఓ వ్యక్తిని నిలువునా దోచిన వైనం బ్రిటన్లో చోటుచేసుకుంది. అతని ఏడేళ్ల కొడుకు వీడియో గేమ్ ఆడుతూ చేసిన పనితో కారు అమ్మేసి ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది.

నార్త్ వేల్స్ కి చెందిన ఏడేళ్ల బాబు అషాజ్‌ తన తండ్రి ఐఫోన్లో ‘డ్రాగన్స్‌: రైజ్‌ ఆఫ్‌ బెర్క్‌’ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవెల్ దాటుకుంటూ పోతుండగా.. మధ్యలో వచ్చిన యాప్ యాడ్స్ ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. అలా గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి 100 కోట్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని కొనుక్కుంటూ పోయాడు. ఆ మొత్తం ఎమౌంటు  1,289 పౌండ్లకు అంటే మన కరెన్సీలో లక్షా 30 వేల దాకా చేరింది.

ఈమెయిల్స్ ద్వారా యాపిల్ కంపెనీ నుంచి బిల్లులు జనరేట్ అయిన విషయం గుర్తించిన ఆ పిల్లాడి తండ్రి మొహమ్మద్ ముతాజా షాక్ తిన్నాడు. కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అయినా ముతాజా.. అంత స్థోమత లేకపోవడంతో కారును అమ్మేసుకున్నాడు. ఆషాజ్ కు ఫోన్ పాస్వర్డ్ తెలిసినప్పటికీ.. ఆటలో అపరిమిత కొనుగోలు వ్యవహారంపై రచ్చ మొదలైంది.

నిజానికి అది ఫ్రీ వెర్షన్ గేమ్. నాలుగేళ్లు పైబడిన పిల్లలు ఎవరైనా ఆడొచ్చు. కానీ  అంతేసిఅమౌంట్ కొనుగోలు యాడ్‌లను ఇవ్వడంపై ముతాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అందులో పెద్ద మొత్తం ఎమౌంటు తో అనుమతించడం పెద్ద మోసమని ముతాజా వాపోతున్నాడు. ఇదొక పెద్ద స్కామ్ గా భావిస్తూ యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు.  

అయితే కొంతలో కొంత ఊరట 207 పౌండ్లు అంటే సుమారు 21 వేల రూపాయలు వెనక్కి వచ్చాయి. మరోవైపు పిల్లల గేమ్ లో పరిమితులు లేని కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios