వియాత్నంకు చెందిన న్గుయెన్ న్గోక్ మన్హ్(31) అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. అతను ఇటీవల డెలివరీ తీసుకోవడానికి ఓ భవనానికి వచ్చాడు.
ఓ చిన్నారి 12వ అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు జారి పడింది. నిజానికి అయితే.. అంత ఎత్తు నుంచి కింద పడిన తర్వాత చిన్నారి బతికే అవకాశమే ఉండదు. కానీ.. ఈ చిన్నారి విషయంలో మ్యాజిక్ జరిగింది. సినిమాల్లో హీరోలాగా వచ్చిన ఓ డ్రైవర్.. ఆ చిన్నారిని క్యాచ్ పట్టుకున్నాడు. ఈ సంఘటన వియత్నాంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వియాత్నంకు చెందిన న్గుయెన్ న్గోక్ మన్హ్(31) అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. అతను ఇటీవల డెలివరీ తీసుకోవడానికి ఓ భవనానికి వచ్చాడు. అయితే.. అతను తన వెహికిల్ లో కూర్చొని ఉండగా.. ఓ చిన్నారి కిందకు జారడం గమనించాడు.
వెంటనే ఆ చిన్నారిని డ్రైవర్ పట్టేశాడు. కాగా... చిన్నారి వయసు 2ఏళ్లు కాగా.. బాల్కనీలో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు జారి పడింది. అదృష్టవశాత్తు ఆ డ్రైవర్ క్యాచ్ పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
