మోసం చేసిన మాజీ ప్రియుడిపై విచిత్ర రీతిలో కసి తీర్చుకుందో ప్రియురాలు. దీనికోసం ఫుడ్ డెలివరీ బాయ్ ని వాడుకుంది. ఆ చర్యతో తన బాయ్ ప్రెండ్ కు సరిగ్గా బుద్ది చెప్పింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే చైనాలోని బీజింగ్ లో. ఇక ఆ లేడీ కస్టమర్ వింత రిక్వెస్ట్ వెనకున్న బాధను అర్థం చేసుకున్న ఫుడ్ డెలివరీ బాయ్ కూడా దీనికి అంగీకరించాడు. ఆమె ప్రియుడి మొహం మీద కాపీ పోసి ఆమె కోరిక తీర్చాడు. 

ఇంతకీ విషయం ఏంటంటే.. చైనాలోని షాంగ్ డాంగ్ కు చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సైట్‌లో ఓ కాఫీ ఆర్డర్‌ చేసింది. అయితే ఆ కాఫీ తనకోసం కాదు తన మాజీ ప్రియుడి కోసం. ఇక ఆమె ఆ డెలివరీ బాయ్ కి కాల్ చేసి ఓ విచిత్రమైన రిక్వెస్ట్ చేసింది.

అతనితో నువ్వు మర్యాదగా నడుచుకోవాల్సిన అవసరమేమీ లేదు.. ఆ కాఫీ అతని ముఖం మీద కొట్టు.. అని చెప్పింది. డెలివరీ బాయ్ మొదట ఇది విని షాక్ అయ్యాడు. ఆ తరువాత ఆమె చెప్పినట్లుగానే చేయటానికి సిద్ధపడ్డాడు. 

ఆర్డర్ తీసుకుని ఆమె మాజీ ప్రియుడి దగ్గరికి వెళ్లాడు. అతనికి అర్థమయ్యేలోగానే కాఫీ తీసి అతని మొహం మీద చల్లాడు. ఆ వెంటనే అతని చేతిలో అతని ప్రియురాలు పంపిన ఓ చీటీ పెట్టి, సారీ చెప్పి క్షణాల్లో అక్కడినుండి మాయమయ్యాడు. 

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిమీద నెటిజన్ల వద్దనుంచి మిశ్రమ స్పందన వస్తోంది.