వాషింగ్టన్:  బాస్కెట్ బాల్ కోచ్‌గా పేరొందిన గ్రెగ్ స్టీఫెన్ అబ్బాయిలతో  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  గ్రెగ్ ఇప్పటివరకు సుమారు 440 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినట్టు ఆధారాలు లభించాయి.  నిందితుడిని 180 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అమెరికాలోని లోవాకు చెందిన ఓ ప్రముఖ బాస్కెట్ బాల్ క్లబ్బుకు కోచ్‌గా పని చేశాడు.  ఆ టీమ్‌ను జాతీయ స్థాయి పోటీలకు చేర్చాడు. ఆ క్రీడకు సంబంధించి లోవాలో ఉన్న మంచి కోచ్‌లలో ఒకడిగా పేరొందాడు. గ్రెగ్‌కు అబ్బాయిలంటే పిచ్చి. అమ్మాయిల పేరిట సోషల్ మీడియాలో ఖాతా తెరిచాడు. అమ్మాయిల పేరుతో అబ్బాయిలతో చాట్ చేసేవాడు.

 వారిని ప్రేమిస్తున్నట్టుగా చెప్పేవాడు. అబ్బాయిల నగ్న చిత్రాలను సేకరించేవాడు. తాను కోచ్‌గా ఉన్న బాస్కెట్‌ బాల్ టీమ్ మెంబర్స్, హోటల్స్‌లో నిద్రపోతున్న సమయంలో  అబ్బాయిల దుస్తులిప్పి పక్కనే పడుకొని సెల్ఫీలు తీసుకొనేవాడు.

కొంతమంది పిల్లలను బెదిరించి కోరికలు తీర్చుకొనేవాడు.  అబ్బాయిలు నిద్రలేచేసరికి ఆడుకొనేవాడు. సుమారు 20 ఏళ్ల పాటు ఎవరికీ తెలియకుండా రహస్య కార్యకలాపాలు సాగించేవాడు. గ్రెగ్ ఇప్పటి వరకు 440 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినట్టు ఆధారాలు లభించాయి.  ఈ కేసులో 180 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.