Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని  వ్య‌తిరేకిస్తూ.. టెక్ దిగ్గజం ఆపిల్ త‌న ఉత్పత్తుల విక్రయాలను రష్యాలో  నిలిపివేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. రష్యాలో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ కూడా త‌న‌ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు ప్ర‌క‌టించింది. 

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు ఆరో రోజూ కొనసాగాయి. ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్‌టిర్కా‌(Okhtyrka)లోని మిలిటరీ శిబిరంపై రష్యా జరిపిన ఫిరంగి దాడిలో ఆ దేశానికి చెందిన దాదాపు 70 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. రష్యా సైనిక చర్యపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దురాక్రమణను వెంటనే నిలిపివేయాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక పశ్చిమ దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. కఠిన ఆంక్షలు విధించాయి. ఇప్ప‌టికే రష్యా తన తప్పుడు నిర్ణయానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవ‌ల్సి ఉంటుంద‌ని ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు హెచ్చరిస్తున్నాయి. 

తాజాగా ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని వ్య‌తిరేకిస్తూ.. టెక్ దిగ్గజం ఆపిల్ త‌న ఉత్పత్తుల విక్రయాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. రష్యాలో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ కూడా త‌న‌ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు ప్ర‌క‌టించింది. అంటే .. రష్యాలోని కస్టమర్‌లు ఇకపై Macs, iPhoneలు, iPadలు, ఇతర Apple పరికరాలను కొనుగోలు చేయలేరు. ఆన్‌లైన్ కొనుగోలు చేయడానికి ప్ర‌య‌త్నిస్తున్నా వారికి "డెలివరీ అందుబాటులో లేదు అని వస్తుంది.

ఉక్రేనియన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ మైఖైలో ఫెడోరోవ్ చేసిన విజ్ఞప్తిని అనుసరించి విక్రయాలు నిలిపివేసిన‌ట్టు Apple CEO టిమ్ కుక్ పేర్కొన్నారు. ర‌ష్యా దాడులు తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో మినిస్టర్ మైఖైలో ఫెడోరోవ్ Apple CEO కు లేఖ రాశారు. ర‌ష్యాలో ఆపిల్ అమ్మకాలపై ఆంక్ష‌లు విధించాల‌ని, రష్యాలో యాప్ స్టోర్ యాక్సెస్‌ను నిరోధించాలని ఆపిల్‌ను కోరాడు.

ఉక్రెయిన్ ర‌ష్యా దాడులు త్వ‌ర‌లోనే ఆగిపోతాయ‌ని, ప్రజాస్వామ్య ప్రపంచాన్ని రక్తపాత నిరంకుశ దురాక్రమణ నుండి రక్షించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తాన‌ని అన్నారు. ఇటువంటి చర్యల వ‌ల్ల‌ రష్యా యువత, జనాభా ప్ర‌భుత్వం పై ఒత్తిడి తీసుక‌వ‌స్తార‌ని అనుకుంటున్నాం. ఈ మేర‌కు ఎగుమతులను నిలిపివేసినట్లు, ట్రాఫిక్, ప్రత్యక్ష సంఘటనలను నిలిపివేసినట్లు Apple ఒక ప్రకటనలో తెలిపింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం, దాడి వ‌ల్ల‌ బాధపడుతున్న ప్రజలందరికీ అండగా ఉంటాం. మేము మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాం, శరణార్థులకు సహాయం అందిస్తామ‌ని ఆపిల్ ప్ర‌క‌టించింది. ఈ త‌రుణంలో ర‌ష్యా దండ‌యాత్ర‌కు నిర‌స‌న‌గా రష్యాలో
Apple ఉత్పత్తుల విక్రయాలను నిలిపి చేస్తున్నాం. అలాగే.. Apple Pay, ఇతర సేవలను కూడా పరిమితం చేయిన‌ట్టు తెలిపారు. ఆపిల్ మానవతా సహాయ చర్యలకు విరాళం అందిస్తోంది. శరణార్థుల సహాయం అందిస్తోంది. స‌హ‌యం కోసం Crisismanagement@apple.comని సంప్రదించండ‌ని తెలిపారు. 

ఇప్ప‌టికే ఉక్రెయిన్‌పై దండ‌యాత్ర‌కు దిగిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ త‌గిలేలా బ్రిట‌న్‌, అమెరికా త‌దిత‌ర దేశాలు.. ర‌ష్యా బ్యాంకుల‌ను స్విఫ్ట్ సేవ‌ల నుంచి బ‌హిష్క‌రించాయి. స్విఫ్ట్ విధానాన్ని నిలిపివేయడం ద్వారా చెల్లింపులు చేయాల్సిన సంస్థలు, ఆర్ధిక సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. స్విఫ్ట్ నుంచి ర‌ష్యాను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల ఆ దేశ క‌రెన్సీ ప‌త‌న‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే ర‌ష్యా క‌రెన్సీ ర‌బుల్ 30 శాతానికి దిగ‌జారింది. ఈ నేప‌థ్యంలో బ్యాంక్ ఆఫ్ ర‌ష్యా వ‌డ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది.