అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్‌ సెప్టెంబర్‌ నెల ప్రారంభంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

లాటరీ గెలవడం అంటే మామూలు విషయం కాదు. లాటరీ గెలుచుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఓ వ్యక్తికి కూడా అలాంటి అదృష్ణమే వరించింది. రూ.33లక్షల విలువచేసే లాటరీ గెలిచాడు. అయితే.. ఆ లాటరీ గెలిచిన ఆనందంలో ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తి గత శుక్రవారం కెనడాలోని ఓ బీచ్‌లో విగతజీవిగా కనించాడు. స్థానికుల సమాచారంతో బీచ్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అతని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు విలువైన లాటరీ లభ్యమైంది. సుమారు రూ.33 లక్షల లాటరీని అతను గెలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సముద్రంలో బోట్‌ అదుపు తప్పటం వల్ల మృతి చెందాడని, తర్వాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకొచ్చినట్లు తెలిపారు. ఇక అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్‌ సెప్టెంబర్‌ నెల ప్రారంభంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అతను అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.