Asianet News TeluguAsianet News Telugu

కన్నీళ్లు పెట్టుకున్న డెన్మార్క్‌ ప్రధాని.. క్షమించమంటూ వేడుకోలు.. కారణమేంటంటే..

యూరప్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది.  ఇప్పటికే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రియాతో పాటుగా మరికొన్ని దేశాల్లో కఠిన నిబంధలు అమలు చేస్తున్నారు.  డెన్మార్క్ లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది.  డెన్మార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి కొత్తరకం కరోనా వైరస్ మనుషులకు సోకుతుందని అధికారులు గుర్తించారు. 

Danish PM breaks down after visiting mink farmer whose animals were culled - bsb
Author
Hyderabad, First Published Nov 27, 2020, 11:03 AM IST

యూరప్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది.  ఇప్పటికే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రియాతో పాటుగా మరికొన్ని దేశాల్లో కఠిన నిబంధలు అమలు చేస్తున్నారు.  డెన్మార్క్ లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది.  డెన్మార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి కొత్తరకం కరోనా వైరస్ మనుషులకు సోకుతుందని అధికారులు గుర్తించారు. 

ఉత్తర జూట్ ల్యాండ్ లోని 207 మింక్ పెంపుడు కేంద్రాల్లో ఈ రకం వైరస్ ను గుర్తించారు.  ఈ మింక్ జంతువుల నుంచి మొత్తం 214 మందికి కొత్తరకం కరోనా వైరస్ సోకింది.  దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  ఆ ప్రాంతం నుంచి వైరస్ బయటప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డెన్మార్క్‌ ప్రభుత్వం మింక్‌లను చంపేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఈ నెలలో 1.7కోట్ల మింక్‌లను చంపేయాలని ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడ్రిక్సన్ పార్మెంట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే ఈ నిర్ణయానికి చట్టబద్ధత లేదని అంగీకరించిన మెట్టె.. పార్లమెంట్‌లో క్షమాపణ కూడా కోరారు. 

ఇదిలా ఉంటే ఈ నిర్ణయం వలన ఉపాధి కోల్పోయిన మింక్‌ రైతులను తాజాగా మెట్టె ఫ్రెడ్రిక్సన్ పార్మెంట్‌ కలిశారు. పశ్చిమ డెన్మార్క్‌లోని కోల్డింగ్‌లో ఉన్న ఓ మింక్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఫ్రెడ్రిక్సన్‌.. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ”ఇది నిజంగా వారికి చాలా బాధను కలిగించే సంఘటన. క్షమించండి. నాకు కూడా. వారి జీవనాధారం కోల్పోయారు” అంటూ మెట్టె కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాగా చైనా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, పోలండ్‌లలో ఉన్ని కోసం మింక్‌లను పెంచుతూ ఉంటారు. కానీ కరోనా నేపథ్యంలో పలు చోట్ల వీటిని చంపేయడంతో.. చాలా మంది రైతులు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios