బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ విలియంకు కోవిద్ 19 వచ్చిందని, దాని నుండి ఆయన కోలుకున్నారని మీడియా వర్గాలు భోగట్టా. ఇప్పటికే కరోనా వైరస్ సోకి తగ్గిందని అంటున్నారు. ప్రిన్స్ విలియం తండ్రి ప్రిన్స్ ఛార్లెస్ కు మార్చిలో కోవిద్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నెల ఏప్రిల్ లోనే డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ వియంకూ కరోనా వచ్చిందని ఓ ఇంగ్లీష్ పేపర్ ప్రచురించిది. 

అయితే ఈ విషయం బైటికి రావడం వల్ల దేశంలో అనవసర ఆందోళనలు దారి తీస్తాయని అందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని మీడియా వర్గాలు అంటున్నాయి. దీనిమీద కెన్సింగ్టన్ ప్యాలెస్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. 

కరోనా వైరస్ తో అల్లాడుతున్న దేశప్రజల్ని తన అనారోగ్య విషయం మరింత కలవర పరుస్తుందని ప్రిన్స్ విలియం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని అంటున్నారు. బ్రిటన్ సింహాసనానికి ప్రిన్స్ విలియం రెండో వారసుడు. నార్ ఫోక్ లో ఉన్న అన్మర్ హాల్ భనవంలో ఐసోలేషన్ లో ఉన్నారని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాజ వైద్యులు చికిత్స్ అందించారని సమాచారం. 

ఆదివారం నాటి 23, 254 కొత్త కేసులతో బ్రిటన్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10లక్షలా 34 వేల 914కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు 46 వేల 717మంది చనిపోయారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ కూడా ఏప్రిల్ లో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.