Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్.. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజులో 7 లక్షల కేసులు...!!

‘వరల్డ్ మీటర్’ గణాంకాల ప్రకారం మే 14 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రధానంగా సాంక్రమిక శక్తి ఎక్కువగా ఉన్న కరోనా వైరస్ డెల్టా రకం 135 దేశాల్లో వ్యాప్తి చెందింది. బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఇరాన్ సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇండోనేషియాలో మరణాలు పెరుగుతున్నాయి. 

Covid 19 : Delta variant now in 135 countries, cases in US, China rise at alarming rate
Author
Hyderabad, First Published Aug 7, 2021, 10:39 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోనూ కొత్త కేసులు బయటపడుతున్నాయి. దాదాపు రెండున్న నెలల్లో ఎన్నడూ లేనివిధంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. 

‘వరల్డ్ మీటర్’ గణాంకాల ప్రకారం మే 14 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రధానంగా సాంక్రమిక శక్తి ఎక్కువగా ఉన్న కరోనా వైరస్ డెల్టా రకం 135 దేశాల్లో వ్యాప్తి చెందింది. బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఇరాన్ సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇండోనేషియాలో మరణాలు పెరుగుతున్నాయి. 

అమెరికాలో గత 3 రోజులుగా లక్షకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. డెల్లా రకం వ్యాప్తి పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఆసుపత్రుల పాలయ్యే బాధితు సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

అమెరికా ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ)’ సమాచారం మేరకు ఈ సంఖ్య సగటున 12 వేల నుంచి 43 వేలకు పెరిగింది. దేవవ్యాప్తంగా గురువారం 24 గంటల్లో 1.20లక్షల మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. 

అత్యధికంగా ఫ్లోరీడాలో ఇరవై వేలకు పైగా కొత్త కేసులు బయటపడగా... కాలిఫోర్నియాలో ఈ సంఖ్య పది వేలు దాటింది. అమెరికాలో ఫిబ్రవరి రెండో వారం తర్వాత మళ్లీ ఈ వారంలోనే రోజువారి కేసులు లక్షకుపైగా నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో చేరుతున్న వారిలో  ఫ్లోరిడా, జార్జియా, లూసియానాల్లోనే  40 శాతం మంది ఉన్నారు.

చైనాలో ను డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. స్థానిక వ్యాప్తి ద్వారా శుక్రవారం 80 మందికి కోవిడ్ బారినపడ్డారు. వీరిలో 58 కేసులు జియాంగ్సు ప్రావిన్సులోని యాంగ్ ఝౌ నగరంలోని బయటపడ్డాయి.  ఇక్కడ  డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉంది. మరో ఆరు ప్రావిన్సుల్లో మిగతా కేసులు నమోదయ్యాయి. చైనాలో గత ఏడాది అదుపులోకి వచ్చిన తర్వాత ఇటీవల మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. తాజా ఉద్ధృతి నాన్జింగ్ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ మేరకు కొద్దిరోజులుగా బయటపడిన కేసుల సంఖ్య 1200 దాటింది. దీంతో చైనా మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నాన్ జింగ్ సహా పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ లు విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడంతో పాటు, అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది.

బ్రెజిల్లో రోజువారి కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గురువారం 24 గంటల్లో 40 వేల మందికి పైగా  కోవిడ్ బారిన పడగా.. 1,086 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలో 1700 మందికి పైగా మృతి చెందారు. రోజు వారీ కేసులు సగటున 35 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇరాన్లో ను ఒక్క రోజులో 38,674 కేసులు బయటపడ్డాయి. బ్రిటన్ లో తాజాగా 30,215 మందికి కోవిడ్ సోకింది. రష్యా, టర్కీ, ఫ్రాన్స్, మెక్సికో ల్లోనూ 20 వేలకు పైగా రోజువారి కేసులు నమోదయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios