పెళ్ళైన 12 ఏళ్ళకు 1967లో విడాకులు: 2018లో మళ్ళీ పెళ్ళి

Couple That Divorced 50 Years Ago Decides To Retie The Knot
Highlights

విడాకులు తీసుకొన్న జంట మళ్ళీ పెళ్ళి

న్యూయార్క్:పెళ్ళైన 12 ఏళ్ళకు విడాకులు తీసుకొన్నారు.  ఇద్దరు వేరే వారిని పెళ్ళి చేసుకొన్నారు. అయినా కానీ, వారి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. అయితే తమ భాగస్వాములు చనిపోవడంతో వృద్దాప్యంలో మరోసారి పెళ్ళి చేసుకోవాలని భావించారు. వీరిద్దరికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. జీవిత చరమాంకంలో మరోసారి ఆ జంట ఒక్కటైంది. అమెరికాకు చెందిన జంట మరోసారి వివాహం చేసుకోనున్నారు.

హరాల్డ్ హాలండ్, లిలియన్ బర్న్స్ అమెరికాలోని కెంటకీ ప్రాంతంలో నివాసం ఉండేవారు.  వీరిద్దరికి 1955లో వివాహమైంది. అంటే ఇప్పటికీ సుమారు 63 ఏళ్ళ క్రితమే వీరిద్దరూ వివాహం చేసుకొన్నారు. వీరిద్దరూ పెళ్ళైన 12 ఏళ్ళ పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఈ జంటకు ఐదుగురు పిల్లలు. అయితే 12 ఏళ్ల తర్వాత వీరి కాపురంలో చిచ్చు రేగింది.

తాము కలిసి జీవనం సాగించలేమని తేల్చి భావించారు. విడాకులు తీసుకొన్నారు. 1967 లో వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. వేరే వారితో వివాహం చేసుకొన్నారు. విడాకులు తీసుకొన్న తర్వాత కూడ వీరిద్దరూ తమ మధ్య స్నేహన్ని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం హరాల్డ్ వయస్సు 83 ఏళ్ళు. లిలియానాకు 78 ఏళ్ళు.అయితే వీరిద్దరి భాగస్వామ్యులు 2015 లో మరణించారు. దీంతో మరోసారి వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయమై  తమ కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు.

కుటుంబసభ్యులు కూడ ఈ మేరకు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  దీంతో మరోసారి ఈ జంట వివాహం చేసుకోనున్నారు.చనిపోయేవరకు తాము కలిసి ఉంటామని ఈ జంట చెబుతోంది. 


 

loader