Russia Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నాటో రిక్తహస్తం చూపించింది. రష్యా వైమానిక దాడులను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ను 'నో-ఫ్లై జోన్ గా ప్రకటించాలనే జెలెన్‌స్కీ విజ్ఞప్తిని నాటో దేశాలు తోసిపుచ్చాయి. నాటో విదేశాంగ మంత్రులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా మధ్య బీకర పోరు కొనసాగుతూనే ఉంది. తొమ్మిది రోజులుగా బాంబులు, కాల్పులతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని పలు నగరాలను రష్యా బలగాలు ఆక్రమించాయి. రష్యా చర్యలను అడ్డుకోవడాని ఉక్రెయిన్ అనేక విధాలు ప్రయత్నిస్తుంది. అయినా.. ఫలితం లేకుండా పోతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నాటో సహాయాన్ని కోరగా.. మరో సారి రిక్త హస్తం చూపించింది. రష్యా బాంబు దాడులను ఆపడానికి ఉక్రెయిన్ లో 'నో-ఫ్లై జోన్' విధించాలని జెలెన్‌స్కీ నాటో దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని నాటో దేశాలు తోసిపుచ్చాయి. అయితే పాశ్చాత్య మిత్రదేశాలు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన యుద్ధాన్ని ఆపకపోతే.. ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని హెచ్చరించాయి.
నాటో విదేశాంగ మంత్రులతో శుక్రవారం బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ యూనియన్‌లో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు NATO చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. రష్యాతో ప్రత్యక్ష ఘర్షణలు అణుయుద్ధానికి దారితీస్తుందనే భయంతో కూటమి వివాదంలో జోక్యం చేసుకోదని అన్నారు. నో-ఫ్లై విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌లోకి పంపాల్సి ఉంటుందని, రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో ఫ్లైజ్ విధించాల్సి ఉంటుందని స్టోల్టెన్‌బర్గ్ అత్యవసర సమావేశం తర్వాత చెప్పారు. అలా చేస్తే.. యూరోప్‌లో పూర్తి స్థాయి యుద్ధానికి ముగింపు పలకాల్సి వస్తుందని అన్నారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజల బాధలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
ఉక్రేయిన్ గగనతలాన్ని మూసివేయడానికి NATO ప్రయత్నిస్తే.. రష్యా వైమానిక దాడులను ఆపడానికి మిత్రరాజ్యాలు యుద్ధ విమానాలు,వాయు రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని కైవ్ చెప్పారు. పాశ్చాత్య దేశాలు ఇప్పటివరకు తమ విమానాలను పంపిణీ చేయబోమని, చాలా ఆయుధాల డెలివరీలు తేలికపాటి ఆయుధాలు, యాంటీ ట్యాంక్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులపై దృష్టి సారించాయి.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులెబా వీడియోలింక్ ద్వారా కీవ్ నుంచి మాట్లాడుతూ, వ్యవహారం చేయి దాటిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్‌ను సిరియాగా మార్చనివ్వవద్దని వేడుకున్నారు. యుద్ధానికి వెనుకాడేది లేదని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని, అయితే తమకు భాగస్వాముల నుంచి వెంటనే సహకారం, తక్షణ చర్యలు అనివార్యమని విజ్ఞప్తి చేశారు.
మరింత కఠిన చర్యలు
నో-ఫ్లై జోన్ ప్రకటనను NATO తిరస్కరించిన.. పశ్చిమ దేశాలు రష్యాను ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో నెట్టివేయడానికి పలు ఆంక్షలను విధించింది. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. పుతిన్ ప్రారంభించిన యుద్ధాన్ని ఆపకపోతే, మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ చెప్పారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. యుద్ధం ముగిసే వరకు.. రష్యాపై నాటో మిత్రదేశాలు ఒత్తిడిని కొనసాగించాలని అన్నారు.
అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడానికి తీవ్రంగా ఖండించారు. ఐరిష్ విదేశాంగ మంత్రి సైమన్ కోవెనీ మాట్లాడుతూ.. రష్యాపై EU ఇప్పటికే ఆంక్షలను సిద్ధం చేస్తోందని, వాటిని త్వరలో అంగీకరించవచ్చని అన్నారు. వచ్చే వారం తొలి రోజులలో అంగీకరిస్తామని అన్నారు. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేష్ మూసివేయడం ఇష్టం లేకపోతే కనీసం రష్యా దాడులను తిప్పికొట్టేందుకైనా యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం వంటివి సరఫరా చేయాలని కులెబా కోరారు.
