హాంగ్ కాంగ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ లో ఎంతోకాలంగా రీసెర్చ్ చేస్తున్న లి మెంగ్.... తన పరిశోధనల్లో భాగంగా ల్యాబుల్లో ఈ వైరస్ జనించినట్టు తాను తెలుసుకున్నానని పేర్కొంది.
కరోనా వైరస్ స్వతహాగా జనించిన వైరస్ కాదు, ల్యాబుల్లో తయారుచేసిందని ఎప్పటినుండో కూడా ఒక చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ చైనా ల్యాబుల్లోనే పుట్టిందని చైనా ప్రఖ్యాత వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
హాంగ్ కాంగ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ లో ఎంతోకాలంగా రీసెర్చ్ చేస్తున్న లి మెంగ్.... తన పరిశోధనల్లో భాగంగా ల్యాబుల్లో ఈ వైరస్ జనించినట్టు తాను తెలుసుకున్నానని పేర్కొంది.
కరోనా వైరస్ బయటపడినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి రెస్పాన్స్ లేదని, తాను హెచ్చరించినప్పటికీ... చైనా ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ఆమె అన్నారు. కరోనా వైరస్ ఆ వుహాన్ ల్యాబ్ చైనా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుందని ఈ అభిప్రాయపడ్డారు.
చైనా ప్రభుత్వం చెబుతున్నట్టు వుహాన్ మాంసం మార్కెట్లో ఈ వైరస్ జన్మించలేదని.... తాను శాస్త్రవేత్తలు, డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఈ వైరస్ ల్యాబుల్లో ,వుహాన్ వెట్ మార్కెట్ లో చేస్తున్నారని ఆమె పేర్కొంది.
అంతే కాకుండా, మనిషికి ఈ వైరస్ సోకె ప్రమాదం ఉందన్న విషయం చైనా ప్రభుత్వానికి తెలుసునని, ఒకవేళ పట్టించుకోకుండా వదిలేస్తే... ఇది మహమ్మారిగా రూపాంతరం చెందే ఆస్కారం ఉందన్న విష్యం తెలిసినప్పటికీ.... వారు దీనిపై స్పందించలేదని ఆమె తెలిపారు.
తాను చైనా ప్రభుత్వానికి ఈ విషయం గురించి చెప్పినప్పుడు తనను సైలెంట్ గా ఉండమని వార్నింగ్ తాను అమెరికా చెప్పుకొచ్చారు. తన గురించి తప్పుడు ప్రచారం చేయడానికి కొందరు ఉద్యోగులను నియమించుకుందని ఆమె వాపోయారు.
జీవశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం లేకున్నప్పటికీ... కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన విషయాలను మనం గ్రహించవచ్చని ఆమె తెలిపారు. కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ మనుషుల వేలిముద్రలను పోలి ఉంటుందని, ఈ వైరస్ మనుషులు తాయారు చేసిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆమె అన్నారు.
