Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్... వైద్యశాఖ మంత్రికి కరోనా వైరస్

మేర మంత్రి నాడిన్ డోరీస్‌కు వైద్యపరీక్షలు చేయగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై తాను ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
 

Coronavirus: Health minister Nadine Dorries tests positive
Author
Hyderabad, First Published Mar 11, 2020, 7:51 AM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా... తాజాగా ఈ వైరస్ యునైటెడ్ కింగ్ డమ్(యూకే) వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కి కూడా సోకింది. ఈ మేర మంత్రి నాడిన్ డోరీస్‌కు వైద్యపరీక్షలు చేయగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై తాను ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read డోనాల్డ్ ట్రంప్ కి కరోనా వైరస్ పరీక్షలు..?

డోరీస్ గతంలో 2019 నుంచి స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీగాను పనిచేశారు. యూకేలో కరోనా వైరస్ వచ్చిన మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా డోరీస్ నిలిచారు. ‘‘నేను చేయించుకున్న పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది...వైద్యుల సలహాపై నేను ఇంట్లోనే స్వయం ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నాను’’ అని డోరీస్ పేర్కొన్నారు. యూకేలో ఇప్పటివరకు 380 మందికి కరోనా వైరస్ సోకగా, ఇందులో ఆరుగురు మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios